నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ఒక‌ప్పుడు ఎంత క్రేజ్ ఉండేదో తెలియ‌నిది కాదు. ఇప్ప‌టికీ అదే క్రేజ్ కాక‌పోతే ఎందుకో తెలియ‌దు కాని బాల‌కృష్ణ సినిమాలు మాత్రం పెద్ద‌గా ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకోవ‌డం లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న బోయ‌పాటితో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ చిత్రం కోసం  బాల‌య్య చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తుంది. స‌హ‌జంగా బాల‌కృక‌ష్ణ‌ను ద‌ర్శ‌కుల హీరో అంటారు. కానీ ప్ర‌స్తుతం ప‌రిస్థితులు అలా లేవు. ఎవ్వ‌రినీ న‌మ్మ‌లేము. క‌థ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఆచి తూచి అడుగులు వేయాల్సిన అవ‌స‌రం బాల‌య్య‌కు ఎంతైనా ఉంది. 

 

ఇప్ప‌టికే ఈ చిత్రం విష‌యంలో బాల‌కృష్ణ అన్ని ర‌కాలుగా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఈ సినిమా కోసం మంచి టెక్నిక‌ల్ టీమ్‌ను కూడా తీసుకోవాల‌ని బాల‌య్య చెప్పార‌ట‌.  సినిమాటోగ్రాఫర్ గా సీనియర్ టెక్నిషీయన్ రామ్ ప్రసాద్ ని ఆల్రెడీ ఎంపిక చేసారు. గతంలో బాలయ్య సినిమాలకు పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. బాలయ్య- బోయపాటి కాంబినేష‌న్‌లో గ‌తంలో వ‌చ్చిన  లెజెండ్ సినిమాకు ఆయనే ఛాయాగ్రహకుడుగా ప‌నిచేశారు. ఇటీవలే విడుదలైన `రూలర్` కు కూడా పనిచేసారు. అయితే బోయపాటి సినిమాకు మాత్రం  రామ్ ప్రసాద్  స్థానంలో కొత్త సినిమాటోగ్రాఫర్ ని తీసుకోవాలని భావిస్తున్నార‌ట. మ‌రి స‌డెన్‌గా ఆయ‌న ఎందుకు మార్చాల‌నుకుంటున్నారో తెలియాల్సి ఉంది. 

 

ఇక ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రిలో సెట్స్ మీద‌కు వెళ్ళేలా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. సింహ- లెజెండ్ చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా బాలయ్య  స్టైల్‌.. యాక్షన్ ఎపిసోడ్స్‌...ఫ్యామిలీ సెంటిమెంట్  కచ్చితంగా  ఉంటాయని ఇప్పటికే ప్రచారం సాగుతోంది.  అయితే బోయపాటి ఎంపిక చేసుకున్న కంటెంట్ పై మాత్రం సరైన క్లారిటీ లేదు. మ‌రి బాల‌కృష్ణ‌ను ఇంకెంత కొత్త‌గా ప్రెజంట్ చేస్తాడో బోయ‌పాటి క్లారిటీ కోసం బాల‌య్య ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: