అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అల వైకుంఠపురములో. బన్నీ గత చిత్రం నా పేరు సూర్య డిజాస్టర్ కావటంతో బన్నీలో పాటు బన్నీ ఫ్యాన్స్‌ కూడా ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. పూజ హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె. రాధాకృష్ణ నిర్మించారు. బ‌న్నీ, త్రివిక్ర‌మ్‌ కాంబోలో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్ చిత్రాలు రాగా.. హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యారు.  సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది.  

 

ఫస్ట్ హాఫ్‌ బన్నీ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్‌ మార్క్‌ టేకింగ్, డైలాగ్స్‌ సూపర్బ్‌ అన్న టాక్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా బన్నీ క్యారెక్టర్‌ చించేశాడంటున్నారు ఫ్యాన్స్‌. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ బాగా వర్క్‌ అవుట్ అయ్యిందని, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌ సూపర్బ్‌ అనిపించేలా ఉందంటున్నారు ఫ్యాన్స్‌. అలాగే అటు క్లాస్, ఇటు మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించుకుంటున్న ఈ సినిమాకి ఫస్ట్ రోజు లానే రెండవ రోజు కూడానా బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేలాంటి కలెక్షన్స్ వచ్చాయి.

 

మొదటి రోజు 26.5 కోట్ల షేర్ తో అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ అనిపించుకోగా.. ఆంధ్ర – తెలంగాణ షేర్స్ లో 6వ స్థానంలో నిలిచింది. ఇక రెండో రోజు కూడా అదే స్పీడు కంటిన్యూ చేసింది. అల వైకుంఠపురములో రెండవ రోజు 10 కోట్ల షేర్ ని రిజిష్టర్ చేసింది. కాంపిటీషన్ హై రేంజ్ లో ఉన్నప్పటికీ సెకండ్ డే అన్ని చోట్లా అన్ని షోస్ హౌస్ ఫుల్స్ తో రన్ అవడం వలన ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయ‌ని చెప్పాలి. రెండో రోజు ముగిసేస‌రికి ఈ మూవీ 33 నుంచి 35 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్పాయి.

 

‘అల వైకుంఠపురములో’ ఆంధ్ర – తెలంగాణ 2డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:

 

నైజాం – 9.5 కోట్లు

 

సీడెడ్ – 5.60 కోట్లు

 

గుంటూరు – 4.24 కోట్లు

 

ఉత్తరాంధ్ర – 4.45 కోట్లు

 

తూర్పు గోదావరి – 3.65 కోట్లు

 

పశ్చిమ గోదావరి – 2.93 కోట్లు

 

కృష్ణా – 3.61 కోట్లు

 

నెల్లూరు – 1.62 కోట్లు
-----------------------------------------------------
ఫస్ట్ డే మొత్తం షేర్ – 35.61 కోట్లు
-----------------------------------------------------

 

కర్ణాటక – 4.15 కోట్లు

 

ఇండియా – 1.9 కోట్లు

 

ఓవర్సీస్ – 13.02 కోట్లు
----------------------------------------------------------
వరల్డ్ వైడ్ 2 డేస్ టోటల్ షేర్ – 54.68 కోట్లు
----------------------------------------------------------

మరింత సమాచారం తెలుసుకోండి: