టాలీవుడ్ లో ఇప్పుడు భారీ బడ్జెట్ తో మూవీస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  ఒకప్పుడు హాలీవుడ్.. తర్వాత బాలీవుడ్, కోలీవుడ్ తర్వాత భారీ బడ్జెట్ తో మూవీలు తెరకెక్కిస్తున్నారు.  తెలుగు హీరో రేంజ్ కూడా ఇప్పుడు జాతీయ స్థాయికి చేరుకుంటుంది.  ఒకప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో కలెక్షన్లపరంగా బాలీవుడ్, కోలీవుడ్ కే స్థానం ఉండేది.. కానీ రాజమౌళి పుణ్యమా అని ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి, బాహుబలి 2 ’ మూవీస్ జాతీయ స్థాయిలో రికార్డుల మోత మోగించాయి.

 

ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి, బాహుబలి 2 మూవీస్ కి సాహూ అన్నారు.  ఇక బాహుబలి తర్వాత ఆ రేంజ్ ఖర్చుతో  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’  తెరకెక్కించారు.  పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన సైరా ఆశించిన ఫలితాన్ని మాత్రం పొందలేక పోయింది.  ఆ తర్వాత సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ‘సాహెూ’.  ఈ మూవీలో ప్రభాస్, శ్రద్దా కపూర్ నటించారు.  బాలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ నటీనటులతో సందడి చేశారు. కానీ ఈ మూవీ కూడా డిజాస్టర్ టాక్ వచ్చింది.  గత ఏడాది రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సైతం డిజాస్టర్ టాక్ వచ్చింది. 

 

అప్పట్లో త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్ లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ సైతం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మెగాస్టార్ నటించిన ఖైదీ నెంబర్ 150 మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. వంశి పైడిపల్లి-మహేష్ కాంబినేషన్ లోవచ్చిన ‘మహర్షి’ సైతం సూపర్ హిట్ అయి రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది.  ఈ ఏడాది సంక్రాంతి బరిలో టాప్ హీరోల మూవీస్ పోటీలో ఉన్నాయి. రజినీకాంత్ ‘దర్భార్’, మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’, కళ్యాన్ రామ్ ‘ఎంత మంచివాడవురా’. ఇప్పటికలే దర్భార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో మూడు మూవీస్ రిలీజ్ అయ్యాయి. అయితే టాప్ హీరోల టాప్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్లు చూద్దామా...

1. బాహుబలి 2 42.76

2. సై రా నరసింహారెడ్డి 38.26

3. సాహో 35.36

4. సరిలేరు నీకెవ్వరూ 32.01

5. అల వైకుంఠపురములో 26.76

6. అరవింద సామెత 26.64

7. అజ్ఞాతవాసి 26.39

8. వినయ విధేయ రామ 26.07

9. ఖైదీ నెంబర్ 150 25.05

10.మహర్షి 24.14

మరింత సమాచారం తెలుసుకోండి: