మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. వాటిలో సంక్రాంతికి వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా అత్తకుయముడు అమ్మాయికి మొగుడు సినిమా. ఈ సినిమా విడుదలై నేటికి 31 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1989 జనవరి 14న విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పోగరుబోతు అత్తకు ఆమె పొగరు దించే వగరు అల్లుడి పాత్రలో చిరంజీవివాణిశ్రీ విజృంభించి నటించారు.

 

 

1987 నుంచి 1992 వరకూ వరుసగా ఆరు ఇండస్ట్రీ హిట్ లు ఇచ్చిన మెగాస్టార్ హిట్ల పరంపరలో వచ్చిన ఓ ఇండస్ట్రీ హిట్ ఈ సినిమా. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకు చిరంజీవి లక్కీ చార్మ్ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, పాటలు.. ఇలా అన్ని అంశాల్లో ఈ సినిమా విందు భోజనంలా ఉంటుంది. సంగీత రారాజు చక్రవర్తి అందించిన పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ‘మెరుపులా..’ పాట ఇప్పటికీ హైలైట్. ఈ పాటలో చిరంజీవి వేసిన స్టెప్స్ యువతను, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

 

 

అప్పట్లో 41 సెంటర్లలో 50రోజులు, 14 సెంటర్లలో 100 రోజులు, రాజమండ్రిలో 175 రోజులు రన్ అయింది. ఆడింది. అప్పట్లో 5కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ను రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో అశేష మెగా అభిమానుల సందడి నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సినిమాను తమిళంలో రజనీకాంత్ హీరోగా గీతా ఆర్ట్స్ పున:నిర్మించింది. ఆ సినిమాలో చిరంజీవి గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చి ఓ ఫైట్ లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: