ప్రతీ దర్శకుడికి ఓ మార్క్ ఉంటుంది. దాని నుంచి బైటకు రావడానికి ఇష్టపడరు. ఎలాంటి కథ ఎంచుకున్నా.. తమదైన స్టైల్లో తీస్తారనడానికి పండుగకు వచ్చిన సినిమాలే బెస్ట్ ఎగ్జాంపుల్. సరిలేరు నీకెవ్వరు తీసిన అనిల్ రావిపూడి.. అల వైకుంఠపురంలో తీసిన త్రివిక్రమ్ వాళ్ల దారిలోనే వెళ్తూ.. మరోసారి ఇంప్రెస్ చేశారు. 

 

త్రివిక్రమ్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన మాటలే. చిన్న కథకు తనదైన స్టైల్లో మ్యాజిక్ చేసి తెరకెక్కిస్తాడు. పాటల్లో.. ఫైట్స్ లో కూడా స్టైయిల్ మెయిన్ టైన్ చేస్తాడు. ఇక బన్నీ లాంటి స్టైలిష్ స్టార్ హీరో కావడంతో.. ఓ రేంజ్ లో సీన్స్ తీశారు. త్రివిక్రమ్ సినిమాలు ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాగా సాగుతాయి. కమర్షియల్, ఎలిమెంట్స్ కోసం.. యాక్షన్ సీన్స్ కోసం క్రియేట్ చేసుకుంటాడు. కథ చిన్నదే అయినా.. డైలాగ్స్ తో ఎంటర్ టైన్ చేస్తూ.. అల.. అల.. కథనాన్ని నడిపించేస్తాడు త్రివిక్రమ్. అల వైకుంఠపురంలో విషయంలోనూ ఇదే ఫార్ములాను ఫాలో అయ్యాడు దర్శకుడు.

 

ఇక అనిల్ రావిపూడి మూవీ అంటే.. యాక్షన్ ఎంటర్ టైనర్ కు కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు. శ్రీనువైట్ల ఫాలో అయిన ఈ ఫార్ములాను పకడ్బందీగా తెరకెక్కిస్తున్నాడు ఈ దర్శకుడు. పటాస్.. సుప్రీమ్.. రాజా దిగ్రేట్.. ఎఫ్ . ఏది తీసుకున్నా.. యాక్షన్ ఎంటర్ టైనర్ మార్క్ దాటి బయటకు రావడం లేదు. 

 

అనిల్ రావిపూడి హీరో కళ్యాణ్ రామ్ అయినా.. స్టార్ హీరో మహేశ్ అయినా.. ఎవర్ని డైరెక్ట్ చేసినా.. తనదైన యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ మార్క్ వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. సరిలేరు నీకెవ్వరులో స్టార్ కావడంతో.. మిలటరీ బ్యాక్ గ్రౌండ్ తో... మీరందరూ మేము కాపాడుకుంటున్న ప్రాణాలు.. బాధ్యత ఉండక్కర్లేదా.. అంటూ మెసేజ్ తో ఇంప్రెస్ చేశాడు దర్శకుడు. ఇలా మన స్టార్ డైరెక్టర్స్.. తమదైన మార్క్ తో మెప్పిస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: