ఈ ఏడాది సంక్రాంతి సినిమాల్లో బన్నీ సినిమా అల.. వైకుంఠపురంలో సందడి మామూలుగా లేదు. మొదటి షో నుంచే యునానిమస్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. నా పేరు సూర్య.. ఫ్లాప్ తర్వాత గ్యాప్ తీసుకున్న బన్నీ ‘అందరూ మెచ్చే సినిమాతోనే వస్తా’ అన్నాడు. అల.. సక్సెస్ మీట్లో తనకొచ్చిన ‘ఈడు మగాడ్రా బుజ్జీ.. చెప్పి మరీ హిట్ కొట్టాడు’ అన్న మెసేజ్ ను తనికెళ్ల భరణి చేత చదివించాడు బన్నీ. ఈ మెసేజ్ విపరీతంగా ఆకట్టుకుందని బన్నీ ఫంక్షన్ లో చెప్పుకొచ్చాడు.

 

 

2018లో పవన్ అజ్ఞాతవాసి, 2019లో రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాల డిజాస్టర్లతో ఉన్న మెగా అభిమానులకు అల్లు అర్జున్ వారి ఆకలిని ఈ సినిమాతో తీర్చేశాడు. మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ రెండు సినిమాలు సంక్రాంతికి వచ్చి ఘోర పరాజయాన్ని చవిచూశాయి. ఈ సంక్రాంతికి అల్లు వారబ్బాయి మెగా హిట్ కొట్టి మెగాభిమానులు, బన్నీ అభిమానుల్లో సంతోషం నింపాడు. దీనిపై ఫ్యాన్స్ అనేక సెంటిమెంట్లను ప్రస్తావిస్తున్నారు. అజ్ఞాతవాసి జనవరి 10న, వినయ విధేయ రామ జనవరి 11న వస్తే.. బన్నీ అల.. వైకుంఠపురంలో జనవరి 12న వచ్చింది. వరుస ఏడాదిలో వరుస డేట్లో వచ్చిన సినిమాల్లో బన్నీ హిట్ కొట్టి తమ ఆకలి తీర్చాడని సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.

 

 

ఏ,బీ,సీ సెంటర్లతో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు రాబడుతోంది. అల.. ఇప్పటికే యూఎస్ లో భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. మొదటి రోజు ప్రీమియర్లతో సహా ఇప్పటికే 1.5 మిలియన్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లోనే 35 కోట్లకు పైగా వసూలు చేసి స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. రాబోయే రోజుల్లో భారీ రికార్డులు సాధించనుంది అల.. వైకుంఠపురంలో మూవీ.  

మరింత సమాచారం తెలుసుకోండి: