హిట్ కాంబినేషన్ అయినా టాలీవుడ్  స్టైలిష్ స్టార్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది. ఇప్పటికే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటన విడుదల కాగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రికార్డులు సృష్టించింది... ఇక సినిమా పాటలు విడుదల కాగానే రికార్డు సృష్టించింది... ఇక ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత భారీ రికార్డులను సృష్టిస్తోంది. 

 

 

 సంచలన వసూళ్లు రాబడుతూ ఎన్నో రికార్డులను సైతం తిరగరాస్తుంది అల్లు అర్జున్ అల వైకుంఠ పురములో సినిమా. ఈ సినిమాలో అల్లు అర్జున్ తన క్లాసిక్ లుక్ తో అదరగొట్టేశాడు. మాటల మాంత్రికుడు డైలాగ్స్ కి  అల్లు అర్జున్ తోడవడంతో సినిమా ప్రేక్షకుల ను ఒక రేంజ్ లో ఆకర్షిస్తుంది. ఇక మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని విజయ విహారం చేస్తూ సంచలన వసూళ్ళు రాబడుతుంది ఈ సినిమా. బాక్సాఫీస్ వద్ద దర్బార్ సరిలేరు నీకెవ్వరు లాంటి బడా హీరోల సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది నిర్మాతలకు  భారీ లాభాలు పంట పండించింది అలా వైకుంఠపురములో సినిమా. ఇప్పటికే వందకోట్ల మార్కుకు చేరువలో ఉంది.

 

 

 ఇక తాజాగా హిట్ కాంబినేషన్ అయిన అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠ పురములో సినిమా అరుదైన రికార్డును సాధించింది. యూఎస్లో వీకెండ్ లో విడుదలై అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ టెన్ సినిమాలు అల్లు అర్జున్ అల  వైకుంఠపురములో  సినిమా టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లింది. హాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టి మరి 1.43 మిలియన్ డాలర్లు వసూలు చేసింది అలా వైకుంఠపురములో  సినిమా. కాగా టాప్ టెన్ సినిమా లో భారత సినిమాలు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు, దర్బార్, చెపాక్ తానాజీ సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: