సంక్రాంతి బరిలో మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. అనిల్ రావిపూడి డైరక్షన్ లో సరిలేరు నీకెవ్వరు, త్రివిక్రమ్ డైరక్షన్ లో అల వైకుంఠపురములో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు అంచనాలను అందుకున్నాయి. సినిమాల వసూళ్లు కూడా బాగున్నాయి. 

 

ఇక ఈ సినిమాలతో పాటుగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ మూవీ ఎంత మంచివాడవురా సినిమా వస్తుంది. సంక్రాంతి సందర్బంగా జనవరి 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయ్. ఇక ఈ సినిమా చూసేందుకు ఐదు క్రేజీ థింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కళ్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాగా వస్తుంది. 

 

సినిమా చూసేందుకు మొదట చెప్పుకునే రీజన్ కళ్యాణ్ రామ్ 118 హిట్ తర్వాత వస్తున్న సినిమా ఇది. అందుకే నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక రెండోది సినిమా దర్శకుడు సతీష్ వేగేశ్న  దర్శకత్వం.. సంక్రాంతికి ఆయన తీసిన శతమానం భవతి అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. ఆ సెంటిమెంట్ తో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అంటున్నారు. ఇక మూడవ రీజన్ ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా వస్తుంది. 

 

ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ వచ్చి సినిమా పై బజ్ బాగా పెంచాడు. అప్పటివరకు సోసోగా ఉన్న ఈ సినిమాపై బజ్ తారక్ ఎంట్రీతో సూపర్ ప్రమోషన్ దొరికింది. ఇక ఈ సినిమాకు కలిసి వచ్చే ఆఖరి రీజన్ సంక్రాంతి సీజన్. తప్పకుండా పెద్ద సినిమాలు ఎన్ని వచ్చినా సంక్రాంతికి వచ్చే చిన్న సినిమాలకు ఎప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ లెక్కన చూస్తే కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవిరా కూడా హిట్ అవుతుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: