భారతీయ సినీ పరిశ్రమంలో సూపర్ స్టార్ గా అందరి మనసు దోచిన హీరో రజినీకాంత్.  ఆయన ఏది చేసిన ఒక ప్రత్యేక స్టైల్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఏడు పదుల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీగా నటిస్తూ.. దుమ్మురేపుతున్నారు.  అయితే కొంత కాలంగా రజినీకాంత్ ఒకే తరహా సినిమాలు రావడంతో అభిమానులకు నిరుత్సాహ పడటంతో కొత్త తరహాలో కనిపించాలని చూశారు.  ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన ‘దర్బార్’ మూవీలో నటించారు. ఈ మూవీలో చాలా కాలం తర్వాత రజినీకాంత్ పోలీస్ పాత్రలో కనిపించారు.  దర్బార్ మూవీలో రజిని పవర్ ఫుల్  పోలీస్ అధికారిగా దుమ్మురేపాడు.  ఆ మద్య  లింగా, కబాలి, కాలా లాంటి సినిమాలు డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.  ఆ తర్వాత పెట్టా మూవీతో కాస్త పరవాలేదు అనిపించుకున్నారు.  మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘దర్బార్’ ఈ మద్య కాలంలో మహిళలపై అత్యాచారాల ఘటనపై తీసిన విషయం తెలిసిందే. జనవరి 9న భారీ ఎత్తున విడుదలైన ఈ మూవీ రెండు రోజుల పాటు పోటీ లేకపోవడంతో కుమ్మేసింది.

 

ముంబై నేపథ్యంలో నడిచే మాఫియా యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. రజనీకాంత్‌తో రోబో చిత్రాలను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్‌తో నిర్మించింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగులో మంచి వసూళ్లను రాబడుతోంది. అయితె తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా టాక్ రాకున్నా.. దర్బార్ 4 రోజుల్లో 7.57 కోట్ల వసూళ్లను రాబట్టింది.  నైజామ్ లోనే ఈ సినిమా 3.78 కోట్ల వసూళ్లను సాధించింది.

 

ఇక తమిళనాట 3వ రోజున అంటే జనవరి 11వ తేదీన ఒక్క రోజునే ఈ సినిమా 30 కోట్లను వసూలు చేయడం రికార్డ్‌గా మారింది. దీంతో ఈ సినిమా 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.  దర్బార్ మొదటి ఐదు రోజులకుగాను రూ.150కోట్లు వసూళ్లు రాబట్టుకొంది.  తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా టాక్ రాకున్నా.. అయితే తమిళ వెర్షన్ దర్బార్ మాత్రం కుమ్మేస్తోంది. ఆల్రెడీ 100 కోట్ల కలెక్షన్ ను దాటి సూపర్ హిట్ అనిపించుకుంది.

 

దర్బార్ 4 డేస్ కలెక్షన్ రిపోర్ట్:

నైజాం : రూ. 3.78 కోట్లు

సీడెడ్ : రూ.  0.92 కోట్లు

గుంటూరు :  రూ.  0.57కోట్లు

వైజాగ్ :  రూ.  0.78 కోట్లు

ఈస్ట్ :  రూ.  0.50 కోట్లు

వెస్ట్:  రూ.  0.33 కోట్లు

నెల్లూరు:  రూ.  0.29 కోట్లు

కృష్ణ:  రూ.  0.40 కోట్లు

ఆంధ్ర+తెలంగాణ : రూ. 7.57 కోట్ల షేర్

మరింత సమాచారం తెలుసుకోండి: