సక్సెస్ఫుల్ సూపర్ స్టార్ మహేష్ బాబు... ఓటమి ఎరుగని దర్శకుడు అనిల్ కపూర్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఓ వైపు మహేష్ బాబు వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతుంటే మరో వైపు దర్శకుడు అనిల్ రావిపూడి వరుస విజయాలతో ఓటమెరుగని దర్శకునిగా ఉన్నారు.ఈ  హిట్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా ప్రకటన విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు పెంచేసింది. మరోసారి మహేష్ బాబు ఖాతాలో  భారీ హిట్ చేరడం ఖాయమని ప్రేక్షకులు భావించారు. ఇక జనవరి 11 వ తేదీన సంక్రాంతి పండుగ ముందు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల అంచనాలు అన్నింటిని సంతృప్తి పరుస్తూ ఈ సినిమా... సంచలన విజయాన్ని నమోదు చేసింది. 

 

 

 మొదటి నుంచి ప్రేక్షకులు అనుకున్న  విధంగానే సంచలన విజయాన్ని నమోదు చేసి భారీ వసూళ్లను రాబడుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు  తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టి  ప్రేక్షకులను మెప్పించాడు. అంతే కాకుండా ఎప్పుడూ క్యూట్ గా కనిపించే మహేష్ బాబు ఈ సినిమాలో మాస్ లుక్ తో అదరగొట్టి...  అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా  ఇచ్చారు. దీంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి భారీ వసూళ్లు రాబట్టింది. వసూళ్ల  విషయంలో సంచలన రికార్డులను నమోదు చేస్తుంది సరిలేరు నీకెవ్వరు సినిమా. 

 

 

 తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఓవర్సీస్ లో కూడా అద్భుత వసూళ్లను రాబడుతు దుమ్ము రేపుతోంది ఈ సినిమా . సరిలేరు నీకెవ్వరు సినిమా విజయ పరంపర కొనసాగుతూనే ఉంది వసూళ్లు కూడా భారీగా వస్తూనే ఉన్నాయి. ఓవర్సీస్  తోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలన వసూళ్లు రాబడుతోంది సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే  ప్రపంచవ్యాప్తంగా103 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు  చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేసింది. బ్లాక్ బస్టర్ కబాబ్ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది చిత్రబృందం. పండుగ వీకెండ్ ఈ మూవీ విజయానికి ప్లస్ కాగా..  ఇక సెలవు దినాల్లో  ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: