పేరులోనే కోమలత్వం. మాటలో మాత్రం కఠినత్వం. చూపుల్లో చల్లదనం. చేతల్లో గంబీరత్వం. ఇవి రోజాకున్న లక్షణాలు. నవ్వించే సమయంలో నవ్విస్తుంది. బుద్ది చెప్పే సమయంలో మందలిస్తుంది. ఇవి ఆమె చేసే షోలో కనిపించే వేరియేషన్స్. ఇక లైఫ్ లో ఎప్పుడు బిజీగా ఉండే రోజా అటు టీవీ షోలు.. ఇటు రాజకీయాలు.. రెండింటినీ మేనేజ్ చేసుకుంటూ, ఎప్పుడు బిజీబిజీగా ఉంటున్నారు.

 

 

కానీ పర్సనల్ లెఫ్‌ను మాత్రం మిస్సవ్వుతున్నారట. ఇదే కాకుండా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజా, ఐపీఐఐసీ చైర్‌పర్సన్‌గానూ అదనపు బాధ్యతలు చేపట్టి, మరింత బిజీ అయ్యారు. ఇక ఇంత బిజీ టైంలో కూడా ఎంతో కాలంగా తాను చేస్తూన్న టీవీ షోలను మాత్రం వదిలిపెట్టలేదు. అయితే రోజాకు ఒక విషయంలో ఎప్పుడు వెలితి మిగిలినట్లుగా అనిపిస్తుందేమో. అందుకే తాజాగా, స్టేజీపైనే భావోద్వేగాలను ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేశారు. అందుకు అమ్మా, నాన్నసంక్రాంతి కార్యక్రమం వేదికైంది.

 

 

ఇక తాను ఏడవడానికి కారణం పిల్లలతో తాను ఎక్కువ సమయం ఉండలేకపోవడం కావచ్చు అని అనుకుంటున్నారట.. ఇకపోతే మల్లెమాల ప్రొడక్షన్స్ సంక్రాంతి సందర్భంగా ‘అమ్మా, నాన్న ఓ సంక్రాంతి’ అనే ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఈ కార్యక్రమంలో మల్లెమాల ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో వచ్చే కార్యక్రమాలన్నింటిలో పని చేసే ఆర్టిస్టులందర్నీ ఒక వేదికపైకి తీసుకొస్తున్నారు.

 

 

దీనికి సంబంధించిన ప్రోమోలను కూడా ఇప్పటికే విడుదల చేసింది. ఇక ఓ ప్రోమోలో రోజా నిజంగానే ఏడ్చేశారు. కార్యక్రమంలో భాగంగా రోజా కుమారుడు కృష్ణ లోహిత్ ఒక పాట పాడగా. దానికి ఉబ్బితబ్బిబ్బైన రోజా.. స్టేజీపైనే తన కుమారుడిని ముద్దాడుతూ కన్నీరు పెట్టుకునారు..

 

 

ఎంత పెద్ద స్టారైనా తాను ఒక అమ్మనే అనే విషయాన్ని రోజా నిరూపించారు. ఎందుకంటే ఎదిగే పిల్లలకు తల్లిదండ్రులు తప్పా వేరే లోకం ఉండదు. ఆ సమయంలో వారికి దూరంగా ఉండటం అనేది స్వచ్చమైన అమ్మ ప్రేమ విలువ తెలిసిన వారికి బాధాకరమైన విషయమే..

మరింత సమాచారం తెలుసుకోండి: