బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ కెరీర్ స్పీడ్ గురించి ఎలాంటొదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో బ్లాక్ బస్టర్స్ ని అందుకుంటూ స్టార్ హీరో ఇమేజ్ ని సంపాదించుకోవడానికి ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. ప్రయగాత్మక సినిమాలతోపాటు కమర్షియల్ సినిమాలు చేస్తూ మిగతా హీరోలతో పోటీ పడి మరీ దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం వరుణ్ నటించిన స్ట్రీట్ డ్యాన్సర్ 3డి త్వరలో రిలీజ్ కి సిద్దమవుతోంది. ఈలోగానే వరుణ్ ధావన్ నటిస్తున్న 'మిస్టర్ లేలే' సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో లోదుస్తుల(అండర్ వేర్)తో వరుణ్ ధావన్ ఇచ్చిన ఫోజు సోషల్ మీడియాతో పాటు యూత్ వాట్సాప్ ఇన్స్టా లో కూడా ఫుల్ గా వైరల్ అవుతోంది. పోస్టర్ చూస్తుంటేనే ఫన్ ఏ రేంజులో ఉండబోతుందో అర్థమవుతోంది. జుడ్వా సీక్వెల్ లో తన మార్క్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ తో బాలీవుడ్ జనాలతో పాటు టాలీవుడ్ జనాలని విపరీతంగా ఆకట్టుకున్నాడు. 

 

ఇక తాజాగా రిలీజ్ చేసిన 'మిస్టర్ లేలే' పోస్టర్ లో అండర్ వేర్.. ఆ పైన ఒక ఫన్నీ ప్యాక్... ఒక చేతి నుంచి జారుతున్న గన్.. చూస్తుంటే ఖచ్చితంగాఇది  గ్యాంబ్లింగ్ కాన్సెప్ట్ అని తెలుస్తోంది. అండర్ వేర్ లో ధావన్ ని చూడగానే అచ్చం సల్మాన్ నే గుర్తు చేస్తున్నాడు. ఆ మధ్య వచ్చిన జుడ్వా సిరీస్ లో కూడా ధావన్ ఇలానే అండర్ వేర్ లో కనిపించి అమాయొలని బాగా టెంప్ట్ చేశాడు. భారీగా కండలు పెంచాడు. 6 ప్యాక్ యాబ్స్ ఎలివేట్ అయ్యాయి. ఇక సల్మాన్ ని గురూజీగా భావించే ధావన్ తన స్ఫూర్తితోనే గెటప్ మొత్తం మార్చేస్తుండడం ఆసక్తికరంగా ఉందని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నాడు.

 

ఇక 'మిస్టర్ లేలే' పోస్టర్ కి స్ట్రీట్ డ్యాన్సర్ 3డి కొలీగ్స్ నుంచి అదిరిపోయే వ్యాఖ్యలు వచ్చి పడుతున్నాయి. స్ట్రీట్ డాన్సర్ 3డి గాళ్స్ నోరా ఫతేహి -శ్రద్ధా కపూర్ 'చడ్డీ మ్యాన్'.. 'మీరు నాన్న కచ్చా.. లవ్ ఇట్ చిర్కుట్ ను దొంగిలించారు' అంటూ ఆ ఇద్దరూ వ్యాఖ్యానించారు. అయితే 'మాజా లేలే. నాన్-స్టాప్ ఎంటర్ టైనర్. 2021 జనవరి 1న సినిమా థియేటర్లలో విడుదలవుతుంది' అని వెల్లడించారు వరుణ్. ఇక కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక వరుణ్ కి ఫ్లాప్స్ అంతగా లేవనే చెప్పాలి. వరుసగా హిట్స్ పడుతుండటంతో బాలీవుడ్ లో మార్కెట్ కూడా బాగా పెరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: