ప్రస్తుతం టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం గా, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా తెరకెక్కుతున్న ఈ భారీ హిస్టారికల్ మూవీ ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే 75 శాతానికి పైగా షూటింగ్ ని జరుపుకున్న ఈ సినిమాను జులై 30న రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. పలువురు కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులు నటిస్తున్న ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. 

 

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే, ఈ సినిమా మొత్తం కూడా చాలావరకు యాక్షన్, ఎమోషన్స్ ప్రధానంగా సాగుతుందని, కాబట్టి ఇందులో కామెడీ, ఎంటర్టైన్మెంట్ వంటి అంశాలు ఆశించి మాత్రం సినిమాకు వస్తే అటువంటి వారికి నిరాశ తప్పదని కొందరు అంటున్నారు. అయితే గతంలో కూడా రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో ముఖ్యంగా కథ, యాక్షన్ ప్రధానంగానే సినిమాలు సాగాయని, అదే విధంగా ప్రస్తుతం తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ కూడా మంచి ఆకట్టుకునే యాక్షన్, ఎమోషన్ తో తెరకెక్కుతోందని, 

 

అయితే ఇటువంటి సినిమాల్లో కామెడీ వంటివి తక్కువగానే ఉంటాయని, అయితే కామెడీ లేకపోయినప్పటికీ థియేటర్ లో ప్రేక్షకుడిని ఆకట్టుకునే కథ, కథనాలు ఉంటె చాలని, అవే ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పిస్తాయని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకరకంగా ఈ ఆర్ఆర్ఆర్ లో కామెడీ పాళ్ళు తక్కువగా ఉన్నా, సినిమా మాత్రం అనుకున్న దానికంటే పెద్ద విజయాన్ని అందుకోవడం ఖాయం అని ఆర్ఆర్ఆర్ మూవీ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి బాహుబలిని మించేలా ఈ సినిమా ఎంతమేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: