మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా అలవైకుంఠపురములో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ సంపాదించిన విషయం తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హారిక హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు ఇటీవల ఎస్ ఎస్ థమన్ అందించిన సాంగ్స్ యూట్యూబ్ లో ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఇక సినిమాకు కూడా మంచి టాక్ రావడంతో పాటు సాంగ్స్, స్క్రీన్ పై కూడా అదిరిపోవడంతో బన్నీ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం సినిమాపై పొగడ్తలు కురిపిస్తున్నారు. 

 

రెండేళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన అజ్ఞాతవాసి సినిమా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తరువాత, కొంత ఆలోచన చేసిన త్రివిక్రమ్, అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత అనే ఎమోషనల్ మాస్ మూవీ ని తీసి హిట్ కొట్టడం జరిగింది. ఆ తరువాత అల్లు అర్జున్ హీరోగా అలవైకుంఠపురములో సినిమాని ప్రారంభించి, ఎట్టకేలకు రిలీజ్ చేసి, మరొక హిట్ కొట్టిన త్రివిక్రమ్, తన తదుపరి సినిమాను ఒక బడా హీరోతో ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఆ హీరో మరెవరో కాదు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని అంటున్నారు. నిజానికి ప్రభాస్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఎప్పుడో ఒక సినిమా రావలసి ఉందని, అయితే కొన్ని అనివార్య కారణాల వలన అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని సమాచారం. 

 

అయితే ఎట్టకేలకు అలవైకుంఠపురములో సినిమా చూసిన ప్రభాస్, ఆ సినిమా తనకు ఎంతో నచ్చడంతో త్రివిక్రమ్, బన్నీ లకు విషెస్ తెలిపారని, అలానే త్రివిక్రమ్ ని కూడా ప్రత్యేకంగా పిలిపించి తనతో ఒక సినిమా చేయాలనే విషయమై చర్చించారని టాలీవుడ్ వర్గాల టాక్. అలానే ఎప్పటినుండో ప్రభాస్ తో సినిమా చేయాలని భావిస్తున్న త్రివిక్రమ్ కూడా ఆయన మాట ప్రకారం ఒక మంచి కథ సిద్ధం చేసే పనిలో త్వరలో నిమగ్నం అవనున్నారని అంటున్నారు. అన్ని కుదిరితే ప్రభాస్, త్రివిక్రమ్ ల తదుపరి సినిమా ఇదే అవ్వొచ్చని సమాచారం. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: