సంక్రాంతి సందడి అంటే మామూలుగా ఉండదు. పండుగ కోసం నెలల తరబడి ఎదురు చూసేవారు చాలా మంది ఉంటారు. ఏ పండుగకు ఇంటికి వెళ్లినా వెళ్లకపోయినా.. సంక్రాంతికి మాత్రం సెలవు పెట్టాల్సిందే. మరి అంత కష్టపడి పల్లెటూరికి వచ్చాక ఆ మాత్రం సందడి చేయాలి కదా. రోజంతా ఎలాంటి సందడి చేసినా.. ఎంజాయ్ చేసినా.. సాయంత్రాలు కూడా ఆనందంగా గడపండి.

 

అందుకు ఉన్నా మార్గాల్లో సినిమా ఒకటి. అవును సంక్రాంతి అంటే తెలుగు సినిమా కూడా పండుగ చేసుకుంటుంది. సంక్రాంతి కోసం కొన్ని నెలల ముందే నిర్మాతలు ప్లాన్ చేసుకుంటారు. ఈ సారి సంక్రాంతికి నాలుగు సినిమాలు వచ్చాయి. వాటిలో అందరి కంటే.. ముందుగా విడుదలైంది దర్బార్.. సినిమా సూపర్ డూపర్ కాకపోయినా.. రజినీకాంత్ గత చిత్రాలతో పోలిస్తే బెటర్ గా ఉంది.

 

ఇక ఆ తర్వాత విడుదలైన సరిలేరు నీకెవ్వరు హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రత్యేకంగా కామెడీకి దర్శకుడు పెద్ద పీట వేశాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించిన సినిమా ఇది. మహేశ్ బాబు సినిమా అందులోనూ కామెడి అదిరింది. అందుకే ధియేటర్లలో సందడి కనిపిస్తోంది.

 

ఇక ఆ తర్వాత విడుదలైన అల వైకుంఠపురములో.. సినిమా అల్లు అర్జున్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చేసింది. కాస్త గ్యాప్ వచ్చినా అదిరే సినిమాతో త్రివిక్రమ్, బన్నీ సందడి చేస్తున్నారు. ఇక సరిగ్గా పండుగ రోజే కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

 

ఇలా మొత్తం నాలుగు సినిమాలు మీ ముందున్నాయి. అందుకే.. మీ మీ టేస్టులను బట్టి ఏదో ఒక సినిమాకు సినిమాలకు వెళ్ళండి.. కుటుంబంతో కలిసి సినిమా చూస్తే ఆ వినోదమే వేరు కదా. అందుకే పండగ పూట అయినా సరే కుటుంబంతో కలిసి అందరూ చక్కగా ఫస్ట్ షో సినిమాలకు వెళ్ళండి. పిల్లలతో సంతోషంగా గడపండి.

మరింత సమాచారం తెలుసుకోండి: