సూపర్ స్టార్ మహెష్ బాబు నటించిన తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాలో మహేష్ ని టీజ్ చేస్తూ 'హీ ఈజ్ సో క్యూట్.. హీ ఈజ్ సో హాట్' ..అంటూ రష్మిక అల్లరి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో రష్మిక మందన్న గ్లామర్ అండ్ క్యూట్ నెస్ చూసి ఫ్యాన్స్ అంతా ఇదే పాటను తనకి అనువదించి పాడుకుంటున్నారు. వెండి తెర మీద రష్మికను చూసి అందం, అభినయం, డ్యాన్స్‌, గ్లామర్‌తో రష్మిక మనసులను కొల్లగొట్టేసింది అనుకుంటారు.

 

అయితే అలా అనుకున్నవారంతా పొరబడినట్లేనని చిన్న షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎందుకంటే ఈ గ్లామర్ అంతా ఫేకేనని తాజాగా ఒక రూమర్ బయటకు వచ్చింది. రష్మికకు పొట్ట ఫ్లాట్‌గా ఉండేది కాదని కానీ సినిమాలోని బ్లాక్ బస్టర్ పాటలో ఆ పొట్ట కనిపించకుండా ఉండటానికి వీఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి యాబ్స్ కనపడేలా చేశారని ఓ వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతోంది. అంతేకాదు సినిమాలో మహేష్ పక్కన సంగీత, 'డాంగ్ డాంగ్' పాటలో మిల్కీ బ్యూటీ తమన్నా ఉండేసరికి రష్మిక గ్లామర్ తేలిపోయినట్టు అనిపించిందట.

 

రష్మికలో అంత గ్లామర్ ఏమీ లేదని అదంతా వీఎఫ్‌ఎక్స్ మాయేనని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా రష్మిక మాత్రం మొదటిసారి భారీ సక్సస్ ని అందుకుందనే చెప్పాలి. వీఎఫ్‌ఎక్స్ వాడారన్న వార్తల్లో ఎంత నిజం ఉందో తెలీదు కానీ ఫ్యాన్స్ మాత్రం రష్మిక పెర్ఫామెన్స్‌కు ఫిదా అయిపోయారు. ఇప్పటివరకు 'ఛలో', 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో పక్కింటి అమ్మాయిలా కనిపించిన రష్మిక ఈ సినిమాతో గ్లామరస్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం రష్మిక నితిన్‌కి జోడీగా 'భీష్మ' సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలై ఆకట్టుకుంది.

 

కామెడీ, పంచులతో ఉన్న ఆ టీజర్‌ను బట్టి చూస్తే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని ఇప్పటికే నితిన్ ఫ్యాన్స్ ఫిక్సైపోయారు. ఈ సినిమాతో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేయబోతోంది రష్మిక. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైపోయిందని ఇటీవల సుకుమార్ బర్త్‌డే సందర్భంగా మేకింగ్ వీడియోను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ చేశారు. అంతేకాదు మరో రెండు సినిమాలకు సంతకం చేశానని ఇటీవల రష్మిక ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. త్వరల వాటి గురించి ప్రకటిస్తానని సంబరపడుతూ తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: