సంక్రాంతి కానుకగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మించిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక ఈ మూవీ క్రేజ్ ఎలా ఉంది అంటే తెలుగు రెండు రాష్టాల్లో వసూళ్ల బీభత్సం చూస్తుంటే అర్ధమవుతుంది. పోటీగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు కూడా హిట్ టాక్ తెచ్చుకోగా అల వైకుంఠపురములో మాత్రం హంగామా ఎక్కువ చేస్తుంది. 

 

తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాలకు ఎర్లీ మార్నింగ్ షోస్ కు పర్మిషన్ ఇచ్చారు. మాములుగా అయితే వారం వరకు ఈ పర్మిషన్ తీసుకున్నా రెండు, మూడు రోజులు మాత్రమే ఎర్లీ మార్నింగ్ షోస్ వేస్తారు. సరిలేరు నీకెవ్వరు సినిమాకు కూడా వారం మొత్తం ఏపీలో 6,  తెలంగాణలో 5షోస్ కు పర్మిషన్ తీసుకోగా సినిమాకు హిట్ టాక్ వచ్చినా మూడో రోజు నుండి ఎర్లీ మార్నింగ్ షోస్ వేయట్లేదు. కాని అల వైకుంఠపురములో సినిమాకు మాత్రం ఎర్లీ మార్నింగ్ షోస్ కొనసాగిస్తున్నారు. దీన్ని బట్టి చెప్పొచ్చు సంక్రాంతి విన్నర్ ఎవరనేది. అయితే మహేష్ సినిమా కూడా అంత ఈజీగా తీసివేసేలా ఏం లేదు. సినిమా రిలీజయిన 3 రోజుల్లో 63 కోట్లు షేర్ తెచ్చింది అంటే సినిమా రేంజ్ ఏంటన్నది తెలుస్తుంది. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్నాడు మహేష్. 

 

అల్లు అర్జున్ నా పేరు సూర్య ప్లాప్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకుని మరి చేసిన సినిమా అల వైకుంఠపురములో.  ఈ సినిమాకు అన్ని అలా బాగా కుదిరేశాయ్. సినిమా హౌస్ ఫుల్ కలక్షన్స్ చూస్తుంటే బన్ని కెరియర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టేలా ఉన్నాడు.  85 కోట్ల బిజినెస్ తో రిలీజయిన అల వైకుంఠపురములో మొదటి రెండు రోజుల్లోనే 40 నుండి 50 కోట్ల దాకా రాబట్టినట్టు తెలుస్తుంది. ఇక ఈ సంక్రాంతికి వచ్చిన రెండు సినిమా లు ఇలా సూపర్ హిట్ అవడం తెలుగు పరిశ్రమకు మంచి పరిణామం అని చెప్పొచ్చు. 

 

అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు రెండు సినిమా లు బాక్స్ఆఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్లుతున్నాయి. సరిలేరు నీకెవ్వరులో రష్మిక మందన్న హీరోయిన్ కాగా.. వైకుంఠపురములో పూజా హెగ్డే నటించింది.హీరోయిన్స్ ఇద్దరికీ కూడా ఈ సినిమాలు మంచి మైలేజ్ ఇచ్చాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: