సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన తాజా చిత్రం `ద‌ర్బార్‌` త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఆర్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఐదు భాష‌ల్లో జ‌న‌వ‌రి 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా విడుద‌ల‌య్యాక మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. అయితే ఈ మ‌ధ్య వ‌చ్చిన ర‌జ‌నీకాంత్ గ‌త చిత్రాల‌తో పోల్చుకుంటే ఈ చిత్రం ప‌ర్వాలేద‌నిపించుకుంది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే మురుగుదాస్ ర‌జ‌నీకాంత్‌ని గ‌ట్టెక్కించిన‌ట్టే అని చెప్పాలి. ఈ మ‌ధ్య ర‌జ‌నీకాంత్ న‌టించే చిత్రాల్లో క‌థ క‌థ‌నాలు ఎందుకోగాని స‌రిగా కుద‌ర‌డం లేదు. దీంతో త‌లైవా హిట్‌ను చూసి చాలా కాల‌మే అయింద‌ని చెప్పాలి. రజినీ అభిమానులు విన్టేఙ్ స్టైల్ రజినీని చూస్తూ ఫుల్ ఫిదా అయ్యారు.

 

మొదటి నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో 150 కోట్ల గ్రాస్ మార్క్ సాధించిన ఈ చిత్రం ఆ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మొదటి రోజు తప్ప మిగతా రోజుల్లో డ్రాప్ అవుతూనే ఉంది. డైరెక్ట్ తెలుగు సినిమాలు ఫుల్ ఫామ్ లోకి రావడంతో 5వ రోజు దర్బార్ ఫుల్ గా డ్రాప్ అయ్యింది. ర‌జ‌నీ క్రేజ్ వ‌ల్లే ఆ మాత్రం క‌లెక్ష‌న్ల‌ను సాధించ‌గ‌లిగింది. 

 

ఆంధ్ర – తెలంగాణలో 14.5 కోట్లకి అమ్ముడు పోయిన ఈ సినిమా మొదటి 5 రోజుల్లో దాదాపు 8 కోట్ల మార్క్ కి చేరువైంది. ఇక ఫుల్ రన్ లో మరో 7 కోట్లు చేస్తే కానీ డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు వచ్చే అవకాశం లేదు.

 

రజినీకాంత్ ‘దర్బార్’ 5 రోజుల ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్స్:

నైజాం – 3.98 కోట్లు
సీడెడ్ – 95 లక్షలు
గుంటూరు – 60 లక్షలు
ఉత్తరాంధ్ర – 82.5 లక్షలు
తూర్పు గోదావరి – 52.4 లక్షలు
పశ్చిమ గోదావరి – 35 లక్షలు
కృష్ణా – 42.7 లక్షలు
నెల్లూరు – 31.6 లక్షలు

ఐదు రోజుల మొత్తం షేర్ – 7.97 కోట్లు

 

మ‌రి ఈ సంక్రాంతి సంద‌ర్భంగా ఇంకా ఈ చిత్రానికి ఏమ‌న్నా క‌లెక్ష‌న్స్ వ‌స్తాయా లేక ప్రేక్ష‌కులంతా స్ట్రైట్ మూవీస్‌వైపే చూస్తారా అన్న‌ది తెలియాల్సి ఉంది. అలాగే ఇంత వ‌య‌సు వ‌చ్చినా ర‌జ‌నీ స్టైల్‌ను చూసేందుకు జ‌నం ఎగ‌బ‌డుతున్నారంటే గ్రేట్ అనే చెప్పాలి. ఇక డిస్ట్రిబ్యూట‌ర్ల‌ని గ‌ట్టెక్కిస్తారా లేదా అన్న‌ది వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: