గత సంవత్సరం జరిగిన ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్ర‌త్యేక ప్యాకేజీ   పాచిపోయిన ల‌డ్డూతో పోల్చి భారతీయ జనతా పార్టీని విపరీతంగా టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పడు రూట్ మార్చి అదే భారతీయ జనతాపార్టీ తో కలసి రాజకీయ పోరాటాలు ఎన్నికలలో కలిసి పోటీ చేయడానికి లైన్ క్లియర్ అందరికీ షాక్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన రాజకీయ ఒప్పందాలు రేపు పూర్తి అవ్వబోతున్నాయి.

ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగుతూనే ఉండగా వచ్చేనెల నుంచి పవన్ మళ్ళీ తన సినిమాల విషయంలో కూడ బిజీ కాబోతున్నాడు. ఇప్పటికే దిల్ రాజ్ నిర్మాణంలో ప్రారంభం కాబోతున్న ‘పింక్’ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్మూవీ షూటింగ్ కొంతవరకు నడిచాక మార్చి నెలలో రాబోతున్న ఉగాది రోజున క్రిష్ మూవీని కూడ ప్రారంభిస్తున్నట్లు టాక్.

స్వాతంత్రం రాక ముందు ఉండే పరిస్థితుల నేపధ్యంలో ఇప్పటికే తయారుకాబడ్డ క్రిష్ మూవీ కథలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తూ పేదవారికి సాయం చేసే వ్యక్తిగా కనిపిస్తాడని టాక్. పవన్ భావజాలానికి చాల దగ్గరగా ఉండే ఈ మూవీ కథ బాగా నచ్చడంతో పవన్ ఈ సంవత్సరం తన వైపు నుండి రెండు సినిమాలు ఉండేలా వేగంగా పూర్తి చేస్తాడు అని అంటున్నారు.

ఇది ఇలా ఉండగా పింక్ రీమేక్ లో నటిస్తున్నందుకు పవన్ కు 50 కోట్ల పారితోషికంతో పాటు ఈ మూవీకి సంబంధించిన లాభాలలో కూడ వాటా ఇస్తానని దిల్ రాజ్ పవన్ కు చెప్పి ఒప్పించినట్లు ఇప్పటికే వార్తలు ఉన్నాయి. అంతేకాదు ‘పింక్’ రీమేక్ ను 20 కోట్ల బడ్జెట్ తో పూర్తి చేసి ఈ మూవీకి 100 కోట్లకు పైగా బిజినెస్ చేయాలి అని ఆలోచనలు చేస్తున్నా ఇప్పటికే అందరికీ కథ తెలిసిపోయి హిందీ తమిళ భాషలలో కూడ రిలీజ్ కాబడిన ‘పింక్’ కు దిల్ రాజ్ కోరుకున్న స్థాయిలో క్రేజ్ ఏర్పడి ఆ స్థాయిలో భారీ బిజినెస్ అవ్వడం అసాధ్యం అని అంటున్నారు. దీనితో దిల్ రాజ్ ఈ సినిమాకు సంబంధించి వేసుకున్న లెక్కలు తప్పుతాయి అంటూ ఈ మూవీ ప్రారంభం కాకుండానే అప్పుడే కామెంట్స్ వస్తున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: