సంక్రాతి రేస్ సినిమాల హడావిడి ఈ పండుగ తరువాత పూర్తిగా తగ్గిపోతుంది. ఇక ఇప్పట్లో వచ్చే టాప్ హీరోల సినిమాలు ఏమి లేకపోవడంతో ఇక అందరి దృష్టి ఈ ఏడాది జూలై రాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ పైనే ఉంటుంది.  

మూవీ షూటింగ్ ముగింపు దశకు వచ్చినట్లే అంటూ ఈ మూవీ యూనిట్ లీకులు ఇస్తూ ఈ మూవీ మార్కెట్ కు లైన్ క్లియర్ చేస్తున్నారు. అంతేకాదు రాజమౌళి గతంలో ప్రకటించిన జులై 30వ తారీకున ఈ చిత్రాన్ని విడుదల అవుతుంది అని చరణ్ స్వయంగా లీకులు ఇస్తున్నాడు. 

దీనితో ఈ ఫస్ట్ లుక్ గురించి టైటిల్ ప్రకటన గురించి అందరు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు రాజమౌళి సినిమాలలో ఉండే విధంగా ఈ మూవీలో కూడ ఇంటర్వెల్ ముందు సీన్స్ ఒళ్ళు గగుర్లు పొడిచే విధంగా ఉంటుంది అని టాక్. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు మరియు కొమరం భీమ్ పాత్రల్లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. 

వీరిద్దరు కలిసి అల్లూరి మరియు కొమరం భీమ్ ల పాత్రలలో బ్రిటీష్ వారిపైకి యుద్ధానికి వెళ్లి  బ్రిటీష్ వారిని మట్టికరిపించడంతో ఇంటర్వెల్ పడుతుందట. ఇంటర్వెల్ కు ముందు ఉండే ఈ 20 నిమిషాల భీకర యుద్ద సన్నివేశాల్లో అల్లూరి పాత్రలో చరణ్ మరియు కొమరం భీమ్  పాత్రలో ఎన్టీఆర్ ను చూస్తూ ఉంటే సగటు ప్రేక్షకుడు వారిద్దరిని చూస్తూ అలాగే  ఉండిపోవాలని అనిపించేలా ఈ సీన్ తీసారని తెలుస్తోంది. ఆ సీన్స్ లో వీరిద్దరి నటన మరియు రౌద్రం సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.  ఇలా ఇక రానున్న రోజులలో ఈ మూవీకి సంబంధించిన లీకులు ఇస్తూ ఈ మూవీ మార్కెట్ ను అత్యంత భారీ స్థాయలో చేసే ఆలోచనలో జక్కన్న ఉన్నట్లు టాక్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: