ఇప్పటికీ సంక్రాంతికి  ఎన్నో  సినిమాలు పోటీ పడుతు బడా హీరోలు సంక్రాంతి ఎక్కడ తగ్గకుండా తమ సినిమాలను విడుదల చేసి తమ సత్తా చాటారు. ఇప్పటివరకూ విడుదలైన సినిమాలు అన్నీ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని భారీ వసూళ్లను  రాబట్టాయి. అటు సినీ ప్రేక్షకులు కూడా ఈ సంక్రాంతికి సంప్రదాయ పండుగలతో పాటు సినీ  పండుగను జరుపుకుంటున్నారు. అయితే ఇప్పటికే సంక్రాంతికి భారీ పోటీ ఉన్నప్పటికీ నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఎంత మంచివాడురా  సినిమా విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు. కాగా నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్ షోను ఇప్పటికే యూఎస్ఏలో ప్రదర్శించారు. ప్రవాస భారతీయులందరూ ఈ సినిమాను ఇప్పటికే చూసేశారు. 

 

 

 అయితే మొదటి రోజా యుఎస్ఎలో అందరినీ ఆకర్షించింది ఈ సినిమా. ఫుల్  ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఎంత మంచి వాడవురా సినిమాలో  కళ్యాణ్ రామ్  ఎన్నడూ లేని విధంగా  కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకులను ఆకర్షించడని చెప్పాలి. ఇక శతమానం భవతి లాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాను తెరకెక్కించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు సతీష్ విగ్నేష్న  ఈ సినిమాకు దర్శకత్వం వహించడం కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఇక మొదటి సారి ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలో నటించిన కళ్యాణ్ రామ్ నిజంగానే ఎంత మంచి వాడవురా అనిపించుకున్నాడు. ఈ సినిమాలో ఫుల్ పాజిటివ్ ఆటిట్యూడ్ తో కనిపించే కళ్యాణ్ రామ్  మిగతా వాళ్లను కూడా పాజిటివ్ గా మార్చే ప్రయత్నిస్తూ ఉంటాడు. 

 

 

 ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్.. కామెడీని అన్నింటిలో బాలెన్సింగ్ నటిస్తూ... సరైన సమయంలో యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు కళ్యాణ్ రామ్. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్గా నటించిన మెహ్రిన్  కూడా తన పాత్రలో చక్కగా ఒదిగిపోయి నటించింది  అని చెప్పాలి. ఇక ఈ సినిమా కథ విషయంలో కంటే స్క్రీన్ ప్లే  విషయంలో ఎక్కువగా దృష్టి పెట్టిన దర్శకుడు పనితనాన్ని  చూపించాడు. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ అనుకున్న స్థాయిలో లేకపోవడం పాటలు అంతగా వర్కవుట్ అవ్వకపోవడం ఈ సినిమాకు మైనస్ అయ్యే  ఛాన్స్ ఉంది . కాగా ఈ సినిమా స్టోరీ క్లిక్ అయితే మంచి వసూళ్లను రాబట్టి అవకాశం ఉంది. ఇక ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలన్నీ భారీ విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: