సంక్రాంతి రేసులో మొదటిగా వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినా ఈ మూవీ బిసి సెంటర్లలోని ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆ రీత్యా ఈ మూవీ బయ్యర్లు గట్టెక్కుతారని భావించారు. అయితే ఈ మూవీతో పోటీగా మరునాడు విడుదలైన ‘అల వైకుంఠపురములో’ మూవీ మ్యానియా కేవలం ఎ క్లాస్ సెంటర్లు మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ లో మాత్రమే కాకుండా ఈ మూవీ మ్యానియా తెలుగు రాష్ట్రాలలోని బిసి సెంటర్లలో కనిపిస్తూ ఉండటం ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే అన్ని తరగతుల ప్రేక్షకులు మాట్లాడుకుంటూ ఉండటం అందరికీ షాక్ ఇస్తోంది.

వాస్తవానికి ‘అల వైకుంఠపురములో’ పాటలు సూపర్ హిట్ అవ్వడంతో ఈ మూవీ సక్సస్ అవుతుంది అన్న అంచనాలు వచ్చినా ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఈ మూవీకి బిసి సెంటర్లలో కూడ రావడం చాల షాక్ ఇస్తోంది. సాధారణంగా త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ బిసి సెంటర్ల ప్రేక్షకులు ఎంజాయ్ చేయరు. 

అయితే త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ ను బిసి సెంటర్లలోని మాస్ ప్రేక్షకులు కూడ ఎంజాయ్ చేస్తున్న తీరు చూస్తుంటే మాస్ ప్రేక్షకుల అభిరుచిలో కూడ ఎంత మార్పు వచ్చిందో స్పష్టంగా కనిపిస్తోంది. ‘అల వైకుంఠపురములో’ సక్సస్ కేవలం త్రివిక్రమ్ బన్నీల సక్సస్ గా చూడకూడదని మాస్ ప్రేక్షకుల అభిరుచిలో కూడ వచ్చిన మార్పుకు సంకేతంగా ‘అల వైకుంఠపురములో’ మూవీ విజయాన్ని పరిగణించాలని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 

ముఖ్యంగా ‘సామజవరగమనా’ లాంటి క్లాస్ టచ్ ఉన్న సాంగ్ కు మాస్ ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్న తీరు చూస్తుంటే మాస్ ప్రేక్షకులలో వచ్చిన మార్పును నేటి తరం దర్శకులు నిర్మాతలు హీరోలు స్పష్టంగా గుర్తించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా సంక్రాంతి రేస్ విన్నర్ గా సంక్రాంతి సినిమా కోడి పందాలలో బన్నీ సంక్రాంతి పుంజు చేస్తున్న హడావిడితో ఎన్ని రికార్డులు క్రియేట్ అవుతాయో ఇప్పటికి తెలియకపోయినా ప్రేక్షకులలో ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పును ‘అల’ సూపర్ సక్సస్ అందరికీ అర్ధం అయ్యేలా క్లారిటీ ఇస్తోంది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: