దర్శక ధీరుడు రాజమౌళి టాలీవుడ్ సూపర్ హీరోలైన రామ్ చరణ్ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్  ఇప్పటికే ఈ సినిమా పై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత దర్శక ధీరుడు చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాలో టాలీవుడ్ సూపర్ స్టార్స్ నటిస్తుండడంతో ఈ సినిమా ఈ రోజు రోజుకి అంచనాలను పెంచేస్తుంది. ఇక ఈ సినిమా గురించి ఏ చిన్న లీక్  బయటికి వచ్చిన అతి పెద్ద సెన్సేషనల్ గా మారిపోతుంది. క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినీ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. చరిత్రలో కలవని వీరుడైన కొమరం భీమ్ అల్లూరి సీతారామరాజు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుంది అనే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. 

 

 

 

 ఈ సినిమాలో  జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్  పాత్రలో నటిస్తుండగా అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా . అయితే ఈ సినిమా గురించి ప్రస్తుతం ఓ వార్త టాలీవుడ్ వర్గాల్లో  హాట్ టాపిక్గా మారింది. ఈ ఇద్దరు హీరోలు కలిసి బ్రిటిష్ వారితో పోరాడిన ఫైట్ సీన్  సినిమాకే హైలెట్గా ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చర్చించు కుంటున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సీన్ ను  రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించారని ఆయన శ్రమ తెరపై కనిపిస్తోందని అంటున్నారు. 

 

 

 ఈ ఒక్క సీన్ కోసమే సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో ఇద్దరు హీరోలు ఎంతో కసరత్తు చేశారు అన్న విషయం తెలిసిందే. భారత స్వతంత్ర సంగ్రామంలో  ఇద్దరు  స్వతంత్ర సమర యోధుల మధ్య జరిగిన ఓ కల్పిత కథ  ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి రూపొందించారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్ పక్కన బ్రిటిష్ యువతి ఒలీవియా నటిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో సముద్రఖని అజయ్ దేవగన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాజమౌళి సినిమాలకు రాజమౌళి అన్న కీరవాణి సంగీతం అందిస్తారు అన్న విషయం తెలిసిందే  ఈ సినిమాకి కూడా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: