తెలుగులో వాళ్ళంటే పండగలకు చేసే సందడి    మామూలుగా  ఉండదు  ఏడాదికి ఒక్కసారివచ్చే  ఈ సంక్రాంతి పండగలోస్తే చాలా ప్రజలకు సంబరాలు ఎక్కువనే సంగతి తెలిసిందే.. అయితే పట్టణాల నుండి పల్లెళ్లకు వెళ్లే ప్రజలు కూడా చాలా మంది ఉంటారు.. పండగలన్నిటి కన్నా కూడా అతి పెద్ద పండగ అంటే అందరు చెప్పుకునే పండుగ సంక్రాంతిపండుగ .. ఈ పండుగ నాడు ఎంతో మంది తమ స్వంత ఊర్లకు వెళ్తున్నారు.. అందుకే ఈ పండుగ నాడు సంబరాలు ఎక్కువనే చెప్పాలి..


ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది సిటీల్లో నివాసాలు ఉంటున్నారు. మూడు రోజుల సంక్రాంతిలో క‌నుమ నాడు చేసే ఆహార ప‌దార్థాల‌కు ప్ర‌త్యేక‌త ఉంది. పితృదేవ‌త‌ల‌కు ఎం తో ఇష్ట‌మైన ప‌దార్ధాల‌ను చేసి ముందుగా వారికి స‌మ‌ర్పించి.. త‌ర్వాత వారి ప్ర‌సాదంగా ఇంట్లో వారంతా భుజించాలి. అందుకే ఈ మూడో రోజు వంటలకు ప్రత్యేకత వేరే అని చెప్పాలి..

మొత్తానికి సంక్రాంతి అంటే ఎటు తిరిగి ప్రజలకు భారామే పడిందని చెప్పాలి..కడుపు నిండా తినలన్నా కూడా పాపం సాధారణ ప్రజలకు భారం తడిసి మోపడి అవుతుందంటే నమ్మల్సిందే అందుకే బాడా బాబులకు మాత్రమే ఈ పండుగలు ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు.. సాధారణ ప్రజలు మాత్రం పెనుభారాన్ని భరించలేని పరిస్థితులు. తిండి, కట్టుకునే బట్టలు, అన్నీ కష్టతరంగా మారడంతో సాధారణ ప్రజలు పండుగ అంటే భయపడుతున్నారు..

 

ఇంట్లో చేసుకోవ‌డ‌మే కాదు..
క‌నుమ పండుగ‌ను ఉద‌యాన్ని ఇంట్లో ముగించుకోవాలి., ఇంట్లోనే ప‌శువులు ఉన్న‌వారు వాటిని శుభ్రం చేసుకుని అలంక‌రించుకుని, పూజించాలి. ఒక‌వేళ ఇంట్లో ప‌శువులు లేనివారు ఆల‌యాల్లో ఉండే గోశాలల‌ను సంద‌ర్శించి పూజించాలి. అంటే ఈరోజు కు చాలా ప్రత్యేకత ఉందనుకోండి.. రైతన్నలకు అన్నం పెట్టేది అంటే ఈ పశువులే అందుకే ఎప్పుడు నీ సాయం మాకుండాలి అంటూ ప్రత్యేక పూజలతో  అలంకరిస్తారు.. సంవత్సరానికి చేసే ఈ పండుగ అంటే తెలుగు ప్రజలందరూ సంతోషంగా జరుపుకుంటారు

మరింత సమాచారం తెలుసుకోండి: