త్రివిక్రమ్ సినిమాల్లో మాటలు ఎంత బాగా పేలతాయో అందరికీ తెలిసిందే. చాలా సింపుల్ పదాల్లో త్రివిక్రమ్ జీవిత సత్యాల్ని బోధిస్తాడు. అలాగే పంచు డైలాగుల్లోనూ తనదైన గమ్మత్తు ఉంటుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లని తీయడంలో దిట్ట అయిన త్రివిక్రమ్ ఈ సారి కూడా మంచి హిట్ కొట్టాడు. బన్నీ తో చేసిన అల వైకుంఠపురములో చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో పాటు కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.

 

అయితే ఈ సినిమాలో త్రివిక్రమ్ అటు డైరెక్టర్ గానూ ఇటు రచయితగానూ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. గతంలో త్రివిక్రమ్ కలం పదును తగ్గిందనుకున్న వారందరికీ ఈ సినిమాలో తన పెన్ పవరేంటో చూపించాడు. నెత్తిన బరువుంటే పైకి చూస్తాం. ఎంత కష్ట పడితే అంత పైకి లేస్తాం అనే మాట చాలా మందికి నచ్చింది. ఇలాంటి మాటలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫైట్ సీక్వెన్సెస్ గురించి.

 


రామ్ లక్ష్మణ్ డిజైన్ చేసిన ఫైట్లు చాలా కొత్తగా ఉండడమే కాదు స్టైలిష్ గానూ ఉన్నాయి. ముఖ్యంగా చున్నీ ఫైట్ అయితే సినిమాకే హైలైట్ గా నిలిచింది. దాంతో పాటు క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ కూడా బాగుంది. ఈ ఫైట్ బ్యాగ్రౌండ్ లో పాట పెట్టడం త్రివిక్రమ్ లో ని దర్శకుడి గొప్పతనం. సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు  అంటూ సాగే శ్రీకాకుళం జాన‌ప‌దం బ్యాగ్రౌండ్లో వ‌స్తుండ‌గా.. క్లైమాక్స్ ఫైట్ పెట్ట‌డం త్రివిక్ర‌మ్‌కే చెల్లింది. 

 

గ‌తంలోనూ కొన్ని సినిమాల్లో పాట‌ల బ్యాక్ డ్రాప్‌లో ఫైట్లు వ‌చ్చాయి కానీ.. త్రివిక్ర‌మ్ మాత్రం ఈ ఫైట్‌ను చాలా ఎఫెక్టివ్‌గా తీశాడు. లిరిక్స్ కి తగ్గట్టుగ ఫైట్ ని కంపోజ్ చేసిన తీరు కూడా చాలా బాగుంది. ఈ పాటని ఆడియోతో పాటు రివీల్ చేయకుండా త్రివిక్రమ్ చాలా మంచి పని చేశారు. మొత్తానికి ఈ సినిమాతో తనలోని దర్శకుడు, రచయిత టాప్ కి వెళ్ళిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: