తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ సునీల్ ప్రత్యేక స్థానం ఉంది. కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ ఆ తర్వాత హీరో గా మారి తర్వాత మళ్లీ మాస్ హీరోగా నిరూపించుకుందామని సినిమాలు చేసి బొక్క బోర్లాపడ్డాడు. అయితే మళ్ళీ కమెడియన్ గా తిరిగి తన ప్రయాణం కొనసాగించాలని చూస్తున్నాడు. అయితే గతంలో త్రివిక్రమ్ సినిమాల్లో సునీల్ కి మంచి క్యారెక్టర్లు పడేవి. ఆ క్యారెక్టర్ల వల్లే సునీల్ కి కమెడియన్ గా చాలా మంచి పేరొచ్చింది.

 

త్రివిక్రమ్ ప్రతీ సినిమాలోనూ సునీల్ కనిపించేవాడు. కనిపించడమే కాదు నవ్వించేవాడు కూడా. అయితే మళ్ళీ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్ కి ఇప్పటి వరకు బ్రేక్ రాలేదు. ఇప్పటి వరకు అరడజను సినిమాలు చేసినా ఏ సినిమా ద్వారానూ బ్రేక్ రాలేదు. అలాంటి టైమ్ లో సునీల్ కి బ్రేక్ ఇవ్వాలంటే మళ్ళీ త్రివిక్రమ్ రావాల్సిందే అని అన్నారు. అనుకున్న ప్రకారమే త్రివిక్రమ్ సినిమా అయిన అరవింద సమేతలో అవకాశం ఇచ్చాడు త్రివిక్రమ్.

 

కానీ ఆ సినిమాలో సునీల్ పాత్ర అంతగా పండలేదు. సరే.. ఆ సినిమా కొంచెం సీరియస్ గా సాగే కథ కాబట్టి మరో సినిమాలో త్రివిక్రమ్ తప్పనిసరిగా సునీల్ కు బ్రేక్ ఇస్తారని అనుకున్నారు.  ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 'అల వైకుంఠపురములో' లో సునీల్ కమెడియన్ గా నటించినా పెద్దగా గుర్తు పెట్టుకోదగ్గ పాత్ర అయితే కాదు. ఆ సినిమాలో ఉన్న ఎన్నో పాత్రలలో అదో  పాత్ర తప్ప దానికి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. అందువల్ల ఈ సినిమాతో కూడా సునీల్ కి బ్రేక్ రానట్టే అని తెలుస్తుంది.

 

కాబట్టి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా కూడా సునీల్ ఎలాంటి లాభం లేదు. మరి సునీల్ కి బ్రేక్ ఎవరిస్తారనే ప్రశ్న మొదలైంది. కొందరేమో రాజమౌళినే ఇవ్వాలని అంటున్నారు. కానీ బాహుబలి లాంటి సినిమా తర్వాత ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న రాజమౌళి ఇప్పట్లో సునీల్ తో సినిమా చేసే అవకాశం లేదు. మరి మళ్ళీ సునీల్ కి బ్రేక్ ఇచ్చేదెవరో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: