బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి తన తర్వాతి చిత్రంగా ఆర్.ఆర్.ఆర్ సినిమాని తెరకెక్కిస్తున్న విషయమ్ తెలిసిందే. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీర్ మరియు రామ్ చరణ్ లు హీరోలుగా వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్ర చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ హిందీ భాషలతో పాటు మరీ ఐదు భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తారట.

 


అయితే బాహుబలి ద్వారా ఇండియన్ తెరపై అంతకు ముందెన్నడూ చూడని అద్భుతాన్ని చూపించిన రాజమౌళి ఈ సినిమాలోనూ అలాంటి విజువల్స్ ఉండనున్నాయట. యాక్షన్ సీక్వెన్స్ మరో రేంజ్ లో ఉంటాయట.  తాజా సమాచారం ప్రకారం ఆర్.ఆర్.ఆర్ లో రెండు ముఖ్య ఘట్టాలైనా ఇంటర్వల్ మరియు క్లైమాక్స్ లో వచ్చే పోరాట సన్నివేశాలకు రాజమౌళి సగం బడ్జెట్ కేటాయిస్తున్నారట. 

 

ఆ సీన్లు సినిమాకే హైలైట్ గా నిలుస్తున్నాయట. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ సన్నివేశంలో ఎన్టీఆర్, చరణ్ లు కొమరం భీమ్.. అల్లూరి సీతారామ రాజులుగా బ్రిటిష్ సైన్యంపై యుద్ధం చేస్తారట. ఆ యుద్ధ సన్నివేశాలు గూస్ బంప్స్ వచ్చే విధంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాడట. దాని కోసం చాలా కష్టపడుతున్నాయట. అంతే కాదు ఈ సన్నివేశాలు ఎమోషన్ తో పాటు విజువల్ గానూ ఆహా అనిపిస్తాయట.

 

ఈ యుద్ధ సన్నివేశం విజువల్ వండర్ గా తీర్చిద్దిడానికి రాజమౌళి భారీ బడ్జెట్ కేటాయించారట. ఇక పతాక సన్నివేశాలలో వచ్చే పోరాట సన్నివేశాలపై కూడా జక్కన్న ప్రత్యేక శ్రద్ద పెట్టి అత్యున్నత విలువలతో తెరకెక్కించనున్నారట. అందువల్ల ఈ సన్నివేశాలకే ఆర్.ఆర్.ఆర్ లోని సగం బడ్జెట్ వాటికే ఖర్చు పెడుతున్నారట. మరి అంత ఖర్చు పెట్టి తీస్తున్న ఖచ్చితంగా సూపర్ గా ఉంటాయనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: