నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా సినిమా ఎంత మంచివాడవురా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఆయన సరసన మెహ్రీన్ పీర్జాదా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించగా, శ్రీదేవి మూవీస్, ఆదిత్య మూవీస్ సంస్థలు దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఇకపోతే ఈ సినిమాను కూడా దర్శకుడు సతీష్ మంచి మానవ సంబంధాలు, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ కలబోతగా దీనిని తెరకెక్కించినట్లు చెప్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కాబడిన ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి పర్వాలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ చిత్రం తాలుకా కాన్సెప్ట్ కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. దానిని కళ్యాణ్ రామ్ చక్కగా పోషించారు. 

 

అంతే కాకుండా ఆ కాన్సెప్ట్ తో వచ్చే ఎమోషన్స్ ను దర్శకుడు సతీష్ వేగేశ్న బాగా హ్యాండిల్ చేసారు. అలాగే కథనంలో చోటు చేసుకున్నటువంటి ట్విస్టులు కానీ మెప్పిస్తాయి. అయితే అద్భుతమైన పాయింట్ ను ఇప్పటివరకు దర్శకుడు మంచి ఎమోషన్స్ తో నడిపించారు కానీ, అక్కడక్కడా నెమ్మదించారు. హీరో కళ్యాణ్ రామ్, హీరోయిన్ మెహ్రీన్ ల మధ్య వచ్చే కొన్ని సీన్స్ ఎంతో బాగున్నాయని, అలానే సాంగ్ కూడా బాగానే ఉన్నాయట. ఇక అక్కడక్కడ వచ్చే చిన్న ట్విస్టులతో ఆకట్టుకున్న దర్శకుడు సతీష్, మంచి ఇంటర్వెల్ ఎపిసోడ్ తో సెకండాఫ్ పై కొంత ఇంట్రెస్ట్ ని క్రియేట్చేసాడట. 

 

అనంతరం మొదలయ్యే సెకండ్ హాఫ్ ని కూడా బాగానే నడిపినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా మ‌నుష్యుల‌తో ఎమోష‌న్లు స‌ఫ్లై చేయ‌డం కొత్త కాన్సెఫ్ట్‌ అని అంటున్నారు. మధ్యలో వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్, ఫైట్స్ వంటివి కూడా బాగున్నాయని, అయితే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంత నెమ్మదించిందని అంటున్నారు. ఓవర్ ఆల్ గా సినిమాకు హీరో కళ్యాణ్ రామ్ నటన హైలైట్ అని, మ్యూజిక్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకున్న ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు చూడవచ్చని అంటున్నారు. మరి మున్ముందు ఈ సినిమా ఎంత మేర సక్సెస్ తో దూసుకెళ్తుందో చూడాలి....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: