నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఎంత మంచివాడవురా'.. మేహ్రీన్ హీరోయిన్‌గా నటించింది. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్స్ కి మంచి టాక్ వచ్చింది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15(నేడు) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు వరుసగా విడుదలై హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఇక ఇదే ఊపులో మూడు పెద్ద చిత్రాలతో పోటీ పడుతూ.. నేడు ఎంత మంచివాడవురా! అంటూ థియేట‌ర్‌లో సంద‌డి చేస్తున్నాడు క‌ళ్యాణ్ రామ్‌.

 

 ఈ చిత్రం ద్వారా ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం విశేషం. ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ సినిమాను నిర్మించారు. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే ప్ల‌స్‌లు నిల్‌.. మైన‌స్సులు ఫుల్ అంటున్నారు కొంద‌రు. మ‌రి ఆ మైన‌స్సులు చూస్తే.. పరమ బోరింగ్ కథనం,  అనుకున్న ఎమోషనల్ టచ్ అంతగా వర్కౌట్ అవ్వడం లేదు,  రిపీటెడ్ ఎమోషనల్ సీన్స్, రిపీటెడ్ గా అనిపించే మ్యూజిక్,  సీరియల్ ని తలపించేలా సాగదీయడం, ఎంటర్టైన్మెంట్ లేకపోవడం, లవ్ ట్రాక్ సినిమా మైన‌స్ అయిప‌ట్టు తెలుస్తోంది. 

 

ఇదిలా ఉంటే.. ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించేలా చాలా డీసెంట్‌గా ఉందని కొందరు అంటుంటే.. అస్సలు బాలేదని మరికొంతమంది ట్వీట్స్ చేస్తున్నారు. ఫస్టాఫ్ పూర్తైందని చాలా డీసెంట్‌గా ఉందంటున్నారు. ఇక యుఎస్‌ఏ రిపోర్ట్ ప్రకారం కళ్యాణ్ రామ్ కూడా సంక్రాంతి బరిలో విజయాన్ని అందుకున్నారని ట్వీట్స్ చేస్తున్నారు. మరోవైపు సంక్రాంతి బరిలో డిజాస్టర్‌ కా బాప్ అంటూ మరికొంత మంది ఈ సినిమాపై నెగిటివ్ అభిప్రాాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాగా, ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తో పాటు టి.ఎన్.ఆర్, తనికెళ్ల భరణి, విజయకుమార్, సుమిత్ర, నరేష్, సుహాసిని, వెన్నెల కిశోర్, శరత్ బాబు, అన్నపూర్ణమ్మ, సుధర్శన్, భద్రం, సుభలేఖ సుధాకర్, పవిత్ర లోకేష్ తదితరులు నటించారు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: