ఈసంక్రాంతికి  నిన్నటి వరకు మూడు సినిమాలు విడుదలైయ్యాయి. అందులో  మొదట గా  సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన  దర్బార్ ప్రేక్షకులముందుకు రాగ మొదటి రెండు రోజులు  బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. అయితే  ప్రస్తుతం థియేటర్లు లేకపోవడం అలాగే  ఈసినిమా తరువాత  విడుదలైన  రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు సరిలేరు నీకెవ్వరు, అల... వైకుంఠపురములో దుమ్ము రేపుతుండడం తో దర్బార్ సైడ్ అయిపోయింది. 
 
ఇక సంక్రాంతి బరిలో నిలిచిన  చివరి  చిత్రం కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచి వాడవురా .. శతమానం  భవతి  ఫేమ్ సతీష్ వేగేశ్న డైరెక్టర్ కావడం అలాగే  ఇటీవల విడుదలైన టీజర్ , ట్రైలర్  ప్రామిసింగ్ గా ఉండడంతో ఎంత మంచి వాడవురా పై  మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఈ రోజు విడుదలైన ఈ చిత్రం  ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేదు..  ఫ్యామిలీ డ్రామా  గా వచ్చిన ఈ చిత్రం యునానిమస్ నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంటుంది.  సినిమాలో  ఒక్క కళ్యాణ్ రామ్ తప్ప  వేరే ప్లస్ లు ఏం లేవు.  కాన్సెప్ట్  బాగున్నా బోరింగ్ స్క్రీన్ ప్లే , రిపీటెడ్ సీన్స్ తో  సినిమా ను చెడగొట్టాడు డైరెక్టర్.  సినిమా చూస్తున్నామా  లేక సీరియల్ చూస్తున్నామా అనే ఫీలింగ్ తెప్పించాడు.
 
ఇంకా చెప్పాలంటే మహేష్ బాబు కెరీర్ లోనే  భారీ డిజాస్టర్ గా  మిగిలిపోయిన  బ్రహ్మోత్సవం సరసన నిలిచింది  ఎంత మంచి వాడవురా.  ఈ సినిమా చూస్తుంటే  బ్రహ్మోత్సవానికి సీక్వెల్ చూస్తునట్లుగానే అనిపించింది.  ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు బడా సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తుండడం తో ఎంత మంచి వాడవురా వాటిని  తట్టుకొని ఈటాక్ తో వసూళ్లను రాబట్టడం అసాధ్యం. ఇక గత ఏడాది 118తో హిట్ కొట్టి మళ్ళీ   ట్రాక్  లోకి వచ్చిన కళ్యాణ్ రామ్ ను  తాజాగా ఎంత మంచివాడవురా ముంచేలానే వుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: