డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తాజాగా ఒక సినిమా తెరకెక్కబోన్న సంగతి తెలిసిందే. 'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్ బస్టర్ సక్సస్ తో కంప్లీట్ గా బౌన్స్ బ్యాక్ అయిన పూరి జగన్నాధ్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు భారీగానే సన్నాహాలు చేస్తున్నారు. ప్యాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాని రూపొందించే ప్రయత్నాలలో పూరి టీం ఉన్నారు.  విజయ్ కూడా ఈమధ్య వరసగా ఫ్లాప్స్ పడి ఎదురు దెబ్బలు తినడంతో ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ సాధించాలనే పట్టుదలతో విపరీతంగా కష్టపడుతూ ఉన్నాడట.

 

ఇక ఈ సినిమాకు ఇప్పటికే 'ఫైటర్' అని టైటిల్ నిర్ణయించారు. ఈ సినిమాలో ఫైట్ల కోసం విజయ్ ప్రస్తుతం బ్యాంకాక్ లో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఈమధ్య ఈ ట్రైనింగ్ గురించి తెలుపుతూ నిర్మాత ఛార్మీ ఒక వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో విజయ్ కి శిక్షణ ఇచ్చే మాస్టర్ కిచ ను పరిచయం చేస్తూ మాట్లాడింది. సవటిక అంటూ అక్కడి భాషలో మనకు నమస్కారం పెట్టిన ఆయన విజయ్ కఠిన శిక్షణ తీసుకుంటున్నారని వెల్లడించాడి. ఇక తన టీమ్ మెంబర్స్ తో కలిసి విజయ్ రోజుకు ఆరు గంటల పాటు ట్రైనింగ్ తీసుకుంటున్నారని తెలిపారు. అంతేకాదు ఈ సినిమాలో చూపించబోతున్న ఫైట్స్ ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా లేవని ఆయన చెప్పారు.

 

అయితే ఈ మార్షల్ ఆర్ట్స్ ఫైట్లు.. డిఫ్రెంట్ స్టైల్ మేకింగ్, పాన్ ఇండియా రేంజ్ సినిమా ...ఇదంతా సరే అసలు  ఈ సినిమాలో కథ మీద కూడా పూరి గారు కొంచెం శ్రద్ధ పెడితే బాగుంటుందని సోషల్ మీడియాలో బాగా సెటైర్లు పడుతున్నాయి. ఏదోలా 'ఇస్మార్ట్ శంకర్' హిట్ అయిందనే ఊపులో ఉన్నారు. కానీ ఇస్మార్ట్ లో కథ డిఫరెంట్ గాను, కొత్తగాను ఏమీ లేదు. ఇక మాస్ జనాలకి, అందులోను యూత్ కి బాగా కనెక్ట్ అయింది కాబట్టి హిట్ అయింది. లేదంటే తేడా కొట్టేదే అన్న టాక్ కూడా వచ్చింది. విజయ్ దేవరకొండ సినిమాలు కూడా రొటీన్ అయ్యాయని... అర్జున్ రెడ్డి - సీక్వెల్స్ .. అంటూ సాగుతోందని విమర్శలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి.  ఇలాంటి సమయంలో ఫైట్లు.. పాటలు లాంటి అదనపు హంగులతో పాటు అసలు కథ.. కంటెంట్ పైన కూడా దృష్టి పెడితే బాగుంటుందని పూరి కి నెటిజన్స్ సలహా ఇస్తున్నారు. మరి పూరీ టీం ఈ సలహాలు తీసుకుంటారా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: