సంక్రాంతి సినిమాలన్నీ ధియేటర్లలోకి వచ్చేశాయి. ఇప్పటికే మహేశ్.. సరిలేరు, బన్నీ అల.. వైకుంఠపురములో, రజినీ దర్బార్.. ధియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈరోజు విడుదలైన కల్యాణ్ రామ్ ఎంత మంచివాడవురాతో సంక్రాంతి సినిమాల సందడి పరిపూర్ణమైంది. ఈ సినిమాల్లో ఇప్పటికే సరిలేరు.. అబౌ యావరేజ్ తో వెళ్తుంటే, అల.. వైకుంఠనురములో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈరోజు వచ్చిన కల్యాణ్ రామ్ సినిమాపై మిక్సిడ్ టాక్ వచ్చిందనే చెప్పాలి.

 

 

మొదటి నుంచీ ఎంత మంచివాడవురా సినిమా 2020కి పర్ఫెక్ట్ సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని పబ్లిసిటీ చేశారు మేకర్స్. కానీ..‘ఎంత మంచివాడవురా’.. అంత మంచి సినిమా కాదని చూసిన ప్రేక్షకులు అంటున్నారు. సినిమా చూసాక ఇది ఈ సంక్రాంతి బోరింగ్ ఎంటర్టైనర్ గా నిలిచిపోయిందని కూడా అంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేసి తీసిన ఈ సినిమా రోజూ ఎంటర్టైన్ చేసే సీరియల్స్ తరహాలో సాగదీసి సాగదీసి తెరకెక్కించారని అంటున్నారు. అయితే.. ఆ సీరియల్స్ లో ఉన్నంత ఎంగేజింగ్ గా కూడా ఇందులో లేకపోవడం బాధాకరమనే విమర్శలూ వస్తున్నాయి. ఓవరాల్ సినిమాలో కళ్యాణ్ రామ్ పెర్ఫార్మన్స్ తప్ప చెప్పుకోదగిన అంశాలేవీ లేవని.. ఈ సంక్రాంతికి ఇదే బోరింగ్ సినిమా అని ‘ఎంత మంచివాడవురా’ను చూసిన వారు అంటున్నారు.

 

 

గుజరాతీలో వచ్చిన ఓ సినిమాను తీసుకుని కథలో చాలా మార్పులు చేసి ఈ సినిమా తీశాడు దర్శకుడు సతీశ్ వేగేశ్న. ఫ్యామిలీ సబ్జెక్టులు ఎక్కువగా తెరకెక్కించే ఈ దర్శకుడి గత సినిమా శ్రీనివాస కల్యాణం కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమా కూడా అదే తరహాలో ఉందని అంటున్నారు. ఇప్పటికే సంక్రాంతి రేసులో బన్నీ, మహేశ్ దూసుకుపోతున్నారు. అల.. వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు.. సినిమాల స్పీడ్ ముందు ఎంత మంచివాడవురా పరిస్థితేంటో చూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: