పూజా హెగ్డే ...ముంబాయి నుండి టాలీవుడ్ కి వచ్చింది. అక్కినేని నాగ చైతన్య హీరోగా కొండ విజయ్ కుమార్ ద్రశకత్వం వహించిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. ఆ ఏడాది వరుణ్ తేజ్ హీరోగా నటించిన ముకుంద సినిమాలోను హీరోయిన్ గా నటించింది. అయితే ఆ రెండు సినిమాలు యావరేజ్ హిట్ గా నిలిచాయి. అదే సమయంలో బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో నటించే ఛాన్స్ రావడంతో ముంబాయి వెళ్ళిపోయింది. మొహంజాదారో అనే సినిమాకోసం మొత్తంగా తెలుగులో వచ్చిన అవకాశాలు కూడా వదులుకుంది. కానీ ఆ సినిమా బాలీవుడ్ లో డిజాస్టర్ కావడంతో పూజా ఖాలీ అయిపోయింది. అయితే అదృష్టం కొద్దీ మళ్ళీ తెలుగులో బన్నీ సినిమాలో గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాధం సినిమాలో నటించింది. ఆ సినిమాతో టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసే ఛాన్స్ ని దక్కించుకుంటుంది. 

 

ఇప్పటికే బన్నీ తో రెండు సార్లు.. వరుణ్ తేజ్ తో రెండు సార్లు నటించిన పూజా సూపర్ స్టార్ మహేష్ తో మహర్షి సినిమాలో నటించింది. ఆ సినిమా మంచి కమర్షియల్ సక్సస్ ను అందుకుంది. ఇక తాజాగా త్రివిక్రం బన్ని కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో తో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతేకాదు ఈ బ్యూటి ఒక ట్విస్ట్ కూడా ఇచ్చింది. పూజాకి తెలుగు మాట్లాడటం పెద్దగా రాదు. ఆ మాటకు వస్తే తెలుగు మాట్లాడటం నేర్చుకోలేదు కూడా. కానీ.. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పేస్తూ.. తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న క్రెడిట్ మాత్రం పూర్తిగా పూజా హెగ్డేకు ఇవ్వాలి.

 

పుట్టింది ముంబయి అయినా.. తల్లి దండ్రులు మాత్రం కన్నడిగులు. తన మాతృ భాష తుళుతో పాటు.. కన్నడ.. హిందీ.. ఇంగ్లిషులో ధారాళంగా మాట్లాడేయగలదు పూజా. ఇప్పుడు తెలుగు కూడా మాట్లాడుతోంది. అంతేకాదు.. తన పాత్రలకు తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పేసుకుంటుంది కూడా. తెలుగును నేర్చుకోకపోయినప్పటికి.. తెలుగు భాష మీద ఉన్న ఆసక్తితో తను కలిసి పని చేసే వారితో మాట్లాడటం ద్వారా భాషను నేర్చుకుంది పూజా. తాను నటించిన పాత్రలకు తను డబ్బింగ్ చెప్పుకోవటం వెలితిగానే కాదు.. తన పాత్రకు తగ్గట్లు డబ్బింగ్ ఆర్టిస్టులు సరిగా డబ్బింగ్ చెప్పటం లేదన్న భావన పూజాలో ఉండేదట.

 

అందుకే పూజా తన పాత్రకు తాను డబ్బింగ్ చెప్పుకోవాలన్న విషయాన్ని అరవింద సమేత సినిమా డబ్బింగ్ జరుగుతున్న సమయంలో దర్శకుడి త్రివిక్రమ్ తో షేర్ చేసుకుందట. సర్.. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటా. బాగుంటే పెట్టండి. లేదంటే తీసేయండని అడిగిందట. అందుకు త్రివిక్రమ్ ఓకే చెప్పటం.. ఆమె డబ్బింగ్ ఆయనకు నచ్చటంతో అలానే ఉంచేశారట. అలా అరవింత సమేతలో తన పాత్రకు తనే తెలుగులో మొదటిసారి డబ్బింగ్ చెప్పిందట. అది అందరికి నచ్చటంతో తాజాగా నటించిన అల వైకుంఠపురములో కూడా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్న విషయాన్ని పూజా ఇటీవల తెలిపింది. భాష రాకున్నా.. డబ్బింగ్ చెప్పి మెప్పించిన పూజా టాలెంట్ కు ఫిదా కావాల్సిందేనని ప్రేక్షకులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: