ఇటీవల తాను హీరోగా నటించిన ఎమ్యెల్యే, 118, నా నువ్వే సినిమాలతో ఒకింత వరుసగా ఫ్లాప్ లు చవిచూసిన నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన తాజా సినిమా ఎంత మంచివాడవురా  సినిమా నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. శతమానంభవతి, శ్రీనివాస కళ్యాణం వంటి కుటుంబ కథా సినిమాలు తీసి ఆకట్టుకున్న యువ దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో బంధాలు, అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఒకింత మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమాలో హీరో కళ్యాణ్ రామ్ నటన ఎంతో బాగుందని, అలానే నటులు శరత్ బాబు, సుహాసిని, విజయ్ కుమార్, వెన్నెలకిషోర్, రాజీవ్ కనకాల, 

 

పవిత్ర లోకేష్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించి ఆకట్టుకున్నారని సమాచారం. ఇక ఫస్ట్ హాఫ్ లో దర్శకుడు ఎన్నుకున్న అద్భుతమైన పాయింట్ ను ఎంతైతే బ్యాలన్సుడ్ గా నడిపించారో ఆ బ్యాలన్స్ సెకండాఫ్ లో తప్పడం సుస్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే పూర్తిగా కథ బాగా బలహీన పడినట్టు అనిపిస్తుంది. అంతే కాకుండా నెమ్మదిగా సాగే కథనం, రొటీన్ ఎమోషన్స్ వంటివి మరింత దెబ్బ తెస్తాయి. ఈ విషయంలో దర్శకుడు సతీష్ కాస్త జాగ్రత్త వహించాల్సింది. అయితే సెకండాఫ్ లో క్లైమాక్స్ కూడా పెద్ద ఆకట్టుకునే స్థాయిలో లేదని, ఇది కూడా నిరాశపరిచే అంశం అని తెలుస్తోంది. ముఖ్యంగా తల్లితండ్రులను చిన్నప్పుడే కోల్పోయి అనాధగా జీవనాన్ని కొనసాగిస్తున్న హీరో, తనవలె ఆ విధముగా మరొకరు బ్రతకకూడదని ఎమోషన్స్ సప్లై కంపెనీ పెట్టడం అనే కాన్సెప్ట్ కొత్తగానే ఉందని, 

 

అయితే దానివలన అలా వచ్చి ఇలా వెళ్లే పాత్రలు మరింత ఎక్కువ అవడంతో సినిమాలో కొంత గందరగోళం నెలకొందని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇక గతంలో తీసిన శ్రీనివాస కళ్యాణం మాదిరిగా దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ సినిమా విషయంలో కూడా బోరింగ్, సాగతీతతో కూడిన కొన్ని అంశాలను అలానే తీసాడని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో పాటు సినిమాలోని  కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ సీన్స్ కుటుంబ కథలను ఇష్టపడే వారిని కనెక్ట్ చేస్తుందని, ఆ విధంగా ఓవర్ ఆల్ గా ఈ సినిమా ఒక యావరేజ్ సినిమా అని చెప్పవచ్చని అంటున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: