స్టార్ హీరోయిన్స్ రేసులో నుంచి తీసేస్తారా.. అనే భయం రష్మికను వెంటాడింది. అయితే ఈ భయం సరిలేరు నీకెవ్వరు రిలీజ్ తర్వాత పోయింది. తక్కువ టైమ్ లో క్రేజీ ఇమేజ్ సంపాదించుకున్న రష్మిక వరుసగా ఫ్లాపులతో కాస్త వెనుకబడిపోయినా.. సరిలేరు నీకెవ్వరు సక్సెస్ తో ఊపిరి పీల్చుకుంది. 

 

కన్నడ బ్యూటీ రష్మిక ఛలో అనే హిట్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గీత గోవిందంతో అదిరిపోయే హిట్ అందుకొని స్టార్ హీరోయిన్ అయిపోయింది. మహేశ్.. బన్నీతో జతకట్టే ఛాన్స్ అందుకుంది రష్మిక.

 

రష్మిక తెలుగు ఎంట్రీ రెండు కంటిన్యూస్ హిట్స్ తో అదిరిపోయినా.. ఆ తర్వాత నటించిన దేవదాస్.. డియర్ కామ్రేడ్ నిరాశపరిచాయి. అప్పటికే సరిలేరు నీకెవ్వరులో మహేశ్ తో నటించే ఛాన్స్ అందుకుంది. సరిలేరు నీకెవ్వరు సెట్స్ పై ఉండగానే సుకుమార్ మూవీలో బన్నీ పక్కన సెలక్ట్ అయింది రష్మిక. 

 

ఫ్లాపుల్లో ఉన్న రష్మికాకు సరిలేరు నీకెవ్వరు హిట్ తీసుకొచ్చింది. మరోవైపు నితిన్ తో కలిసి భీష్మ సినిమాలో నటిస్తోంది. సుకుమార్, బన్నీ మూవీలో ఫిబ్రవరిలో ప్రారంభంకానుంది. తమిళంలో ఒకటి.. కన్నడలో మరో మూవీ చేస్తూ.. సరిలేరు నీకెవ్వరు సక్సెస్ తో స్టార్ ఇమేజ్ నిలబెట్టుకుంది రష్మిక. వరుసగా ఛాన్సులు దక్కడంపై రష్మిక ఫుల్ హ్యాపీగా ఉంది. వస్తున్న హిట్ లు ఆమెకు మరింత బూస్ట్ నిస్తున్నాయి. ఇంకేముందీ విజయపథంలో దూసుకెళ్తోంది రష్మిక. స్టార్ హీరోయన్ రేంజ్ లోనే కొనసాగుతూ అభిమానులను పెంచుకుంటోంది. రష్మికకు ఇప్పటికే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆమె నటన, హావభావాలు, డ్యాన్స్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతున్నాయి. ఇంకేముందీ రష్మిక తన ప్రతిభా పాటవాలను మరింత బయటకు తీస్తోంది. సీనియర్ హీరోయిన్లతో ఏమాత్రం తీసిపోకుండా తన టాలెంట్ ఏంటో చూపిస్తోంది. మొత్తానికి రష్మిక లేటెస్ట్ హిట్ తో రెచ్చిపోతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: