గత కొంత కాలం గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్నార ని వార్తలు విన పడుతున్నాయి.. త్రివిక్రమ్ దర్శకత్వం లో తెరకెక్కిన అజ్ఞాతిసి వాసి సినిమా అతి పెద్దా డిజాస్టర్ గా మారిన తర్వాత ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వినపడుతున్నాయి... అయితే ఇంతవరకు ఏ సినిమా పట్టలెక్కించలేదు..

 

కొద్ది రోజులుగా పవన్‌ రీ ఎంట్రీ సినిమా గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌ సూపర్‌ హిట్ పింక్‌ సినిమా ను పవన్‌ తెలుగు లో రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్ర దర్శక నిర్మాతలు గానీ, పవన్‌ గానీ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అభిమానుల్లో డైలామా ఉండేది..

 

తాజాగా పవన్‌ రీ ఎంట్రీ సినిమా మీద క్లారిటీ ఇచ్చాడు సంగీత దర్శకుడు తమన్‌. అల వైకుంఠపురములో సినిమా సూపర్‌ హిట్ అయిన సందర్భంగా తమన్‌ కు శుభాకాంక్షలు తెలుపు తూ ఓ ఫ్లవర్‌ బొకేను పంపించాడు పవన్‌. పవర్‌ స్టార్‌ నుంచి శుభాకాంక్షలు అందుకున్న తమన్‌ ఆ ఆనందాన్ని అభిమానుల తో పంచుకున్నాడు. 

 

తన ట్విటర్‌ పేజ్‌లో పవన్‌ పంపిన ఫ్లవర్‌ బొకే ఫోటో ను ట్వీట్ చేసిన తమన్‌, `నేను ఆరాధించే వ్యక్తి నుంచి ఇలాంటి గిఫ్ట్ రావటం ఆనందంగా ఉంది. ఇది మన నాయకుడు ఫ్యూచర్‌ పవర్‌ పవన్‌ కళ్యాణ్‌ గారి నుంచి వచ్చింది. కృతజ్ఞతలు సార్‌. ప్రస్తుతం ఆయన సినిమాకు పాటలు కంపోజ్‌ చేయటం ఆనందంగా ఉంది. బిగ్గెస్ట్ ఫ్యాన్‌ మూమెంట్` అంటూ ట్వీట్ చేశాడు. ఈ సినిమా ను దిల్ రాజు బ్యానర్‌లో వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు.ప్రస్తుతం అల వైకుంఠపురం లో సినిమా సక్సెస్ ను తమన్ ఎంజాయ్ చేస్తున్నాడు..

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: