టాలీవుడ్  టాలెంటెడ్ హీరోల్లో నితిన్ ఒకడు. దాదాపుగా ఆయ‌న ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి ప‌దేళ్ళ‌వుతుంది.  కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే జోరును కొన్నేళ్ల పాటు చూపించిన నితిన్.. మధ్యలో వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో అతడి కెరీర్ ముగిసిందని అంతా అనుకున్నారు.

 

క‌రెక్ట్‌గా అదే టైమ్‌లో 'ఇష్క్స చిత్రంతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు ఈ యంగ్ హీరో. దీని తర్వాత వరసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నితిన్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా అతడు చేసుకునే అమ్మాయి పేరుతో పాటు పెళ్లి తేదీ, వేదిక గురించి వివరాలు లీక్ అయ్యాయి. కెరీర్ ని కష్టంగా సాగుతున్న సమయంలో నితిన్‌కు ‘ఇష్క్', ‘గుండె జారి గల్లంతయ్యిందే' సినిమాలు స‌డెన్‌గా ట్రాక్‌ని ఎక్కించాయి. వీటి తర్వాత అతడు చేసిన పలు చిత్రాలు మళ్లీ నిరాశనే మిగిల్చాయి. ఈ నేపథ్యంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అ ఆ'తో అతడు భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇది నితిన్ కెరీర్‌లోనే భారీ వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది.


ఏప్రిల్ 16న నితిన్ పెళ్లి జరగనుంది. ఈ విషయాలన్నీ కొన్ని రోజుల కిందటే బయటకొచ్చాయి. తాజాగా పెళ్లి కూతురు ఎవరనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. షాలినీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు నితిన్. ఈమె లండన్ లో ఎంబీఏ చదివింది. ప్రస్తుతం అక్కడే ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా కొనసాగుతోంది. నితిన్ ది షాలిని ఒకటే సామాజిక వర్గం. అమ్మాయి కూడా రెడ్డీస్ కావడం, తన స్థోమతకు తగ్గ సంబంధం కావడంతో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. పెళ్లిని దుబాయ్ లో చేయాలని నిర్ణయించారు. అక్కడే 3 రోజుల పాటు పెళ్లి ప్రక్రియ పూర్తి చేస్తారు.  ఈ క్రమంలోనే ‘భీష్మ', ‘రంగ్ దే', ‘చదరంగం' వంటి సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈ మూడు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: