బాలీవుడ్ గ్రీకు భార్డ్ హృతిక్ రోషన్.. ఈ పేరుకు కేవలం బాలీవుడ్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు. ఫిట్నెస్ లో అందరికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ అమ్మాయిలని తన హాట్ హాట్ బాడీ తో కళ్ళు తిప్పుకోకుండా చేయగల సత్తా ఒక్క హృతిక్ రోషన్ కే సాధ్యం అనటం లో అతిశయోక్తి లేదు. ఇక ప్రపంచంలో అందగాడుగా  కూడా హృతిక్ రోషన్ కు పేరుంది.హృతిక్ రోషన్ ఫిట్నెస్ విషయంలోనే కాదు డాన్స్ విషయంలో కూడా అందరికి ఇన్స్పిరేషన్ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. తన అద్భుతమైన డాన్స్ లతో అదరగొట్టి  ప్రపంచంలోనే మేటి డాన్సర్ గా పేరుతెచ్చుకున్నాడు హృతిక్ రోషన్. హృతిక్ రోషన్ సినిమా డాన్స్ చేస్తుంటే చూడతరమా అంటూ అనిపిస్తూ ఉంటుంది. 

 

 

 ఇక హృతిక్ రోషన్ సినిమాలన్నీ శృతిక్  చేసే డాన్స్ యాక్షన్ సీన్ల గురించి ఎక్కువగా చూస్తూ ఉంటారు అభిమానులు. అద్భుతమైన యాక్షన్ సీన్లతో అదర కొట్టడంతో పాటు పాటల్లో అద్భుతమైన డాన్స్ చేస్తూ అందరిని మెస్మరైజ్  చేస్తూ ఉంటాడు హృతిక్ రోషన్. ఇక తను డాన్స్ తోనే కొన్ని కోట్ల మంది సినీ ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్న హృతిక్ రోషన్ తాజాగా ఓ నెటిజన్  డాన్స్ కి ఫిదా అయిపోయారు. ఈ కుర్రాడి ఎయిర్ వాకర్ స్టైల్ డాన్స్ చూస్తుంటే మైకల్ జాక్సన్ చూస్తున్నట్లు ఉంది అంటూ ప్రశంసించాడు హృతిక్ రోషన్. అయితే ఈ కుర్రాడు డాన్స్ వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓ వ్యక్తి హృతిక్ రోషన్ ప్రభుదేవాలను ట్యాగ్ చేసాడు. 

 

 

 దీనిపై స్పందించిన హృతిక్ రోషన్ ఇంత స్మార్ట్ గా ఎయిర్ వాక్  చేయడం చూడడం ఇదే మొదటి సారి అని ప్రశంసించాడు. ఈ వ్యక్తి ఎవరు అంటూ తనను టాక్ చేసిన వ్యక్తిని సోషల్ మీడియా టాగ్ చేసిన వ్యక్తిని  ప్రశ్నించారు హృతిక్ రోషన్. కేవలం హృతిక్రోషన్ కాదు ఈ యువకుడి డాన్స్ కి బాలీవుడ్ మహామహులు సైతం ఫిదా అయిపోయి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇతను మైఖేల్ జాక్సన్ కి వీరాభిమాని కావడంతో ఇతని పేరు బాబా జాక్సన్ గా మార్చుకున్నాడు ఇతని అసలు పేరు యువరాజ్ సింగ్ గా తెలుస్తుంది.ఇతనికి టిక్ టాక్ లో 10 లక్షల  ఫాలోవర్స్ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: