స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కరెక్ట్ సినిమా పడితే ఎలా ఉంటుంది.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ జబర్దస్త్ హిట్ కొడితే ఎలా ఉంటుంది అంటే అచ్చం అల వైకుంఠపురములో సినిమాలా ఉంటుంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత హ్యాట్రిక్ కాంబోగా వచ్చిన ఈ మూవీ సెన్సేషనల్ హిట్ అందుకుంది. త్రివిక్రమ్ మార్క్ తో పాటుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్ తో వచ్చి తనలోని మరో కోణాన్ని చూపించిన సినిమా అల వైకుంఠపురములో. 

 

సినిమా హిట్ లో ఎక్కువ మార్కులు థమన్ కు ఇచ్చేయొచ్చు.. సామజవరగమనా.. అంటూ తన ట్యూన్ తో తెలుగు రెండు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాడు. ఆ ఒక్క పాటే కాదు సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. సినిమా రిలీజ్ కు ముందే హిట్ జోష్ తెచ్చిన థమన్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాడు. రిలీజయిన సాంగ్స్ లోనే కాదు బీజీఎమ్ అదరగొట్టాడు. ఇక సినిమా ఆడియోలో దాచిన ఒక సర్ ప్రైస్ సాంగ్ థియేటర్ లో దుమ్ముదులిపేసింది. అదే క్లైమాక్స్ లో వచ్చే సిత్తరాల సిరిపడు సాంగ్.. ఓ పక్క ఫైటు జరుగుతుంటే వెనుక ఈపాట వస్తుంది. శ్రీకాకుళం యాసలో వచ్చే ఈ సాంగ్ రావడం కరెక్ట్ టైమ్ లో కరెక్ట్ సాంగ్ అనిపించుకుంది. 

 

ఆ సాంగ్ తో సినిమా మరో లెవల్ కు వెళ్లిందని చెప్పొచ్చు. థమన్ ఆ సాంగ్ లో కూడా అదిరిపోయింది. ఈ సాంగ్ ను ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ కొరియోగ్రఫీ చేయడం విశేషం. ప్రత్యేకంగా ఈ సిత్తరాల సిరిపడు సాంగ్ కు రిపీటెడ్ ఆడియెన్స్ ఉన్నారంటే నమ్మాల్సిందే. సూపర్ హిట్ టాక్ తో సూపర్ హిట్ కలక్షన్స్ తో దూసుకెళ్తున్న అల వైకుంఠపురములో అల్లు అర్జున్ కెరియర్ బెస్ట్ అనిపించుకునేలా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: