వర్కవుట్ కాని విషయాలు పట్టించుకోకూడదు. సెట్ అయినదాన్ని అసలు వదిలిపెట్టకూడదు అన్న మాటని పర్ ఫెక్ట్ గా ఫాలో అవుతున్నాడు నాగచైతన్య. సినిమా సినిమాకు లవర్ బాయ్ ఇమేజ్ ని పెంచుకుంటూ పెళ్లి తర్వాత కూడా రొమాంటిక్ ట్రాక్స్ నడుపుతున్నాడు. ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు స్పెషలిస్ట్ గా మారుతున్నాడు నాగచైతన్య. 

 

నాగచైతన్య లవర్ స్టోరీస్ తోనే సూపర్ హిట్స్ కొడుతున్నాడు. మధ్యమధ్యలో బెజవాడ, దడ, సవ్యసాచి లాంటి మాస్ సినిమాలు చేసినా వర్కవుట్ కాలేదు. దీంతో తనకు బాగా కలిసొచ్చిన లవ్ స్టోరీస్ లోనే నటిస్తున్నాడు. ప్రేమకథలతో ప్రేక్షకులను ఫిదా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ ట్రైల్స్ లోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ చేస్తున్నాడు నాగచైతన్య. 

 

సింపుల్ అండ్ బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్ తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల జీనియస్. చిన్న సబ్జెక్ట్ తో బోల్డంత ప్రేమని చూపిస్తూ యూత్ ని ఆకట్టుకోవడంలో శేఖర్ కమ్ముల దిట్ట. ఇలాంటి లవ్ స్టోరీస్ మేకర్ తో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్. 

 

లవ్ స్టోరీ అనే టైటిల్ తోనే చాలా సింపుల్ గా కనిపిస్తోన్న ఈ మూవీలో చైతన్య పాత్ర కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు ఏమేం పనులు చేస్తాడో అలాంటి పనులతో ఆర్డినరీ కుర్రాడిగా కనిపించబోతున్నాడు నాగచైతన్య. ఇంతకుముందు రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ లోనే ఈ విషయాలు చెప్పేశాడు శేఖర్. 

 

మొత్తానికి నాగచైతన్య మంచి ఊపులో ఉన్నాడు. పెళ్లైన తర్వాత ఎక్కడాతగ్గడం లేదు. కొత్త కథలను ఎంచుకొని అందులో జీవించేప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీకి మంచి ఆదరణ ఉంది. దాన్ని మరింత పెంచుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు నాగచైతన్య. శేఖర్ ఖమ్ముల సినిమాలో కొత్తదనం చూపించేందుకు సిద్ధమయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: