"త్రివిక్రమ్ గారు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు. ఆయన నుంచి నేను ఓర్పుగా ఉండటం నేర్చుకున్నా. ఏ సీన్ అయినా చాలా వివరంగా చెప్తారు. ఆఖరుకు పాటలో ప్రతి లైన్ అర్థాన్నీ చెప్తారు. ఆయన‌లోని గొప్ప గుణం ఈగో లేకపోవడం" అని చెప్పారు పూజా హెగ్డే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'అల.. వైకుంఠపురములో' సినిమాలో ఆమె కథానాయికగా అమూల్య పాత్రలో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో మంగళవారం మీడియా ప్రతినిధులతో  పూజా హెగ్డే సంభాషించారు. ఆ విశేషాలు...

 

ఒక హీరోయిన్ డైరెక్ట‌ర్ గురించి అంత‌లాగా పొగ‌డ‌డం అంద‌రికీ ఆశ్చ‌ర్యాన్నిక‌లిగించింది. అందులోనూ ఒక టాప్ డైరెక్ట‌ర్ అయుండి ఆయ‌న‌కు  అస‌లు కొంచం కూడా గ‌ర్వం లేద‌ని పైగా సెట్స్‌లో ఎంతో కూల్‌గా ఉంటారని అలాగే త‌ను ఒక సాంగ్‌లో ఉన్న లిరిక్స్‌ని కూడా ఎంతో ఓపిక‌గా వివ‌రించార‌ని చెప్పుకొచ్చింది. అలాగే అల సినిమాను ఒప్పుకోవటం వెనుక ముఖ్యమైన కారణాల్లో ఒకటి.. త్రివిక్రమ్ తో మరోసారి పని చేయొచ్చన్న ఉద్దేశంతోనేనని చెప్పింది. తాను ఇప్పటివరకూ ఎంతోమంది దర్శకులతో చేసినా.. త్రివిక్రమ్ అంత కూల్ గా ఉండే దర్శకుడ్ని చూడలేదని చెప్పింది.

 

 త్ర‌విక్ర‌మ్‌లో ఇసుమంత కూడా ఇగో ఫీలింగ్స్ ఉండ‌వ‌ని. అస్స‌లుఎక్క‌డా టెన్ష‌న్ ప‌డ‌కుండా సెట్స్‌లో ప‌ని మొత్తం కూల్ గా చూసుకుంటార‌ని చెప్పింది. ఏదేమైనా నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకోవడం నా పర్ఫార్మెన్స్ మరింత ఎలివేట్ కావడానికి ఉపయోగపడుతోంది. డబ్బింగ్ కు సమస్య కాకుండా సీన్స్ తీసేటప్పుడు డైలాగ్ ఎలా చెప్పాలో నేర్చుకున్నా. 'అల..వైకుంఠపురములో' ని అమూల్య పాత్ర తో నేను మరింతగా తెలుగమ్మాయిని అయిపోయాను. బాలీవుడ్ జనాలు నన్ను హైదరాబాద్ అమ్మాయిననే అనుకుంటున్నారు అన్న‌ది.

మరింత సమాచారం తెలుసుకోండి: