టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ సినిమా రిలీజ్ ఇంక కరెక్ట్ గా నెల సమయం ఉంది. ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే సందర్భంగా 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు చిత్ర బృందం. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు కూడా జోరుగా ప్రారంభమయ్యాయి. ఇక సంక్రాంతి సందర్భంగా ఈ రోజు ఒక కొత్త పోస్టర్ విడుదల చేశారు చిత్ర్ యూనిట్. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ షర్టు.. బనియన్ లేకుండా గడ్డంతో.. పొడవాటి జుట్టుతో రఫ్ గా కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో హీరోయిన్లతో రొమాంటిక్ గా ఉండే సన్నివేశాలు ఉన్నాయి. 

 

ఇక సినిమాలో నలుగురు హీరోయిన్లు ఎందుకున్నారు.. కథ ఏంటి అనేది ఇంకా తెలియలేదు. ఇంతకముందు నాలుగు రోజులు వర్సుగా నలుగురు హీరోయిన్స్ తో ఉన్న పోస్టర్స్ ని రిలీజ్ చేసి ఆసక్తిని రేపిన చిత్ర బృందం ఇప్పుడు విజయ్ సోలో పోస్టర్ రిలీజ్ చేసి మరింత ఆసక్తిని పెంచేశారు. అంతేకాదు విజయ్ గెటప్ చూస్తుంటే 'అర్జున్ రెడ్డి' ఛాయలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా రిలీజ్ అయితే కానీ ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏంటనేవి తెలుస్తుంది. ఇక ఈ తాజా పోస్టర్ లో విజయ్ ఇంటెన్స్ లుక్ లో బాగా యారగెంట్ గా కనిపిస్తున్నాడు. ఇక విజయ్ సాధారణంగా ఫిట్ గా కండలు తిరిగి ఉంటాడు. అయితే ఈ పాత్ర కోసం బరువు తగ్గి స్లిమ్ గా కనిపించాల్సి వచ్చిందట. ఆ పాత్ర డిమాండ్ మేరకు అలా బరువు తగ్గి ఈ సీన్స్ లో నటించాడట.

 

ఈ సినిమాలో విజయ్ సరసన రాశి ఖన్నా.. ఐశ్వర్య రాజేష్.. కాథరిన్ ట్రెసా.. ఇజబెల్ లీట్ నటిస్తున్నారు. అభిరుచిగల చిత్రాలు తెరకెక్కిస్తాడని పేరున్న క్రాంతి మాధవ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె ఎ వల్లభ నిర్మిస్తున్నారు. కె యస్ రామారావు ఈ సినిమాకు సమర్పకులు. అయితే ఇప్పటికే ఈ సినిమా మీద కాస్త డివైడ్ టాక్ కూడా వస్తోంది. ఇంకా విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూడ్ నుండి బయటకు రావడం లేదని అందుకే సక్సస్ లు రావడం లేదని అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఫైటర్ లో నటించబోతున్నాడు. 
   

మరింత సమాచారం తెలుసుకోండి: