సాధారణంగా పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఒక్కోసారి సినిమా మొదటి నుంచి చివరివరకూ ఉన్న పాత్ర కూడా సరిగా ప్రేక్షకులకు కనెక్ట్ కాదు. అందుకు ఉదాహరణలు చాలా పాత్రలనే చూపించొచ్చు. అయితే ఒక్కోసారి మాత్రం జస్ట్ రెండు నిముషాలు స్క్రీన్ టైమ్ ఉండే పాత్ర కూడా వెంటనే ఆడియన్స్ మనసుల్లో రిజిస్టర్ అవుతుంది. అందుకు ఉదాహరణగా అప్పుడెప్పుడో వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఖుషి' గురించి గుర్తు చేసుకుంటే అందులో దర్శకుడు ఎస్ జె సూర్య పోషించిన పాత్ర అలాంటిదే. ఇక ఇప్పుడు అసలు విషయానికొస్తే 'అల వైకుంఠపురములో' సినిమాలో అలాంటిదే ఒక పాత్ర ఉంది. అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కం కమెడియన్ పమ్మి సాయి పోషించిన పాత్ర. ఆ పాత్ర గురించి చెప్పాలంటే ముందు అల సినిమాలో ఉన్న సీన్ గురించి చెప్పాలి. 

 

అల్లు అర్జున్ .. పూజ పోలీస్ స్టేషన్ లో ఉన్న సమయంలో దొంగలా కనిపించే ఒక వ్యక్తి అక్కడే నేలపై కూర్చుని ఉంటాడు. కట్ బనియన్ లో దిగాలుగా కూర్చొని ఉంటాడు. బన్నీ - పూజ ఇద్దరి వాలకం చూడగానే త్రివిక్రం లా ఓ తత్వవేత్తలా పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. బన్నీ తో మాటలు కలిపి "ఎవరు సార్ ఆమె?" అంటాడు. "మా మేడమ్" అంటాడు బన్నీ. మీకు ఆ అమ్మాయి సెట్ అవుతుంది అని బన్నీకి చెప్తాడు. "అదేం లేదు.. మేడమ్ కు ఎంగేజ్ మెంట్ అయిపోయింది" అని బన్నీ అదోలా అంతలేదులే అన్నట్టుగా అంటాడు. పమ్మి సాయి మాత్రం తను చెప్పిన విషయాన్నే మరోసారి నొక్కి చెప్తాడు. ఈ సంభాషణ జరిగినప్పటికి నిజంగానే హీరో హీరోయిన్లు లవర్స్ కాదు...అప్పటికి ఇద్దరి మధ్యా లవ్ ట్రాక్ మొదలవదు.

 

కట్ చేస్తే రెండు నిముషాల్లో లవ్ లో పడతారు. ఇద్దరూ మాంఛి రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పుడు ఒక పోలీసు పమ్మి సాయిని పక్కనుంచి తీసుకుపోతూ ఉంటాడు. ఈ జంటను చూసి "నేను ముందే చెప్పానా మీకు సెట్ అవుతుందని" అంటూ నవ్వుతూ వెళ్లిపోతాడు. ప్రేక్షకులు నవ్వుల్లో మునిగిపోతారు. ఈ సీన్ సినిమా బాగా పేలింది. 'అల వైకుంఠపురములో' సినిమాలో చాలామంది స్టార్ కమెడియన్లు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. కానీ.. ఇంత తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నా ప్రేక్షకులకు గుర్తుండిపోయే సీన్ అది. బన్నీ- పమ్మీ సాయి సంభాషణ.. ఇద్దరి హావభావాలు ఆ సీన్స్ లో హైలైట్స్ గా నిలిచాయి.  

పమ్మి సాయి ఇప్పటివరకూ చాలా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమాలన్నిటిలో ఉంటారు.  అయితే 'అల వైకుంఠపురములో ఆయన పాత్ర మాత్రం ప్రత్యేకమైనదే. ఇది గమనించిన ఫిలిం మేకర్లు పమ్మి సాయికి మరింత క్రేజీ పాత్రలు ఆఫర్ చేయడం ఖాయమని ఇప్పటికే  కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక సాయి అల్లు అర్జున్ నటించిన జులాయి, సన్నాఫ్ సత్య మూర్తి సినిమాలలోను నితిన్ నటించిన అ..ఆ లోను కనిపిస్తాడు. ఇక పమ్మి సాయి త్రివిక్రం కి దూరపు బంధువు అన్న టాక్ ఒకటి ఉంది.  
   

మరింత సమాచారం తెలుసుకోండి: