ఏదైనా సినిమా బాగుంది అంటే.. ఏ అభిమాని అయినా సరే ఒకసారి చూస్తాడు.. రెండు సార్లు చూస్తాడు.. కానీ ఓ అభిమాని మాత్రం ఆ సినిమా ట్రైలర్ ని ఏకంగా ఒకేసారి 28,763 సార్లు చూశాడు. అన్ని సార్లు చూడగానే యూట్యూబ్ కే చిరాకు వచ్చింది.. చేసేది ఏమి లేకా ఆ యూజర్ ను బ్లాక్ చేసి పడేసింది. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎవరైనా సరే.. ఏ అభిమాని అయినా సరే.. తన అభిమాన హీరో చిత్రం వస్తుంది అంటే ఆ హీరో చిత్రం టీజర్ అని, ట్రైలర్ అని ఇలా ప్రతి ఒక్కటి ఒకటికి పది సార్లు చూస్తారు.. మిగితావారికి షేర్ చేస్తారు.. అలానే ఓ అభిమాని ఆ ట్రైలర్ ని ఏకంగా 28,763 సార్లు చూసి అకౌంట్ ను బ్లాక్ చేయించుకున్నాడు.   

 

ఈ నేపథ్యంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్‌ తెరకెక్కిస్తున్న బ్లాక్‌ విడో సినిమా టీజర్‌ను పదేపదే చూస్తున్న ఓ అభిమానికి యూట్యూబ్‌ షాక్ ఇచ్చింది. ఈ విధంగా పేర్కొంది.. ''మీరు ఇప్పటికే 28,763 సార్లు ఈ వీడియోను చూసినందున్న.. మరోసారి దానిని ప్రదర్శించలేకపోతున్నామని తెలిపింది.'' దీంతో ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ ఆ సంస్థ ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసింది. దీంతో యూట్యూబ్ యూజర్లు అందరూ షాక్ గురవుతున్నారు.. ఇకపై వారి అభిమాన హీరో టీజర్ ని చూడలేమా అని... 

 

అందుకే.. ఎవరైనా సరే ఇకపై ట్రైలర్ ని కానీ.. టీజర్ ని కానీ పరిమితి సార్ల కంటే ఎక్కువ సార్లు చూడలేరు.. ఏది ఏమినప్పట్టికి మన ఇండియాలో ఇది మరి ఎక్కువ.. కొన్ని క్షణాల్లోనే కొన్ని మిలియన్ వ్యూస్ ఆ ట్రైలర్ కు వస్తాయి. ఏది ఏమైనా ఇపుడు విధించిన రెస్ట్రిక్షన్ ఇండియాలో విధిస్తే మాత్రం చాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 

 

 


 

 

మరింత సమాచారం తెలుసుకోండి: