టాలీవుడ్ లో ఈ మధ్య మల్టీ స్టారర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి.. మామూలుగానే ఒకరు ఎవరైనా కొత్తగా చేస్తే ఏదైనా చేస్తే దాన్ని మరొకరు చేస్తారు.. అది హిట్ అయిన కాకపోయినా కూడా సినిమాలను తెరకెక్కిస్తున్నారు.. ఇకపోతే ఈ మధ్య అలా వచ్చిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అవుతున్నాయి.. మరి అలా సినిమాలు చేయలేక పోయిన వారెవ్వరూ ఇప్పుడు చూద్దాము..

 

విషయానికొస్తే.. టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ అంటే నందమూరి ఫ్యామిలీ లో తారక్, బాలయ్య జంట..ఈ జంట కలిసి సినిమాలు చేస్తే బాగుంటుంది. కానీ వీరిద్దరు ఎప్పటికీ చేయరేమో అని చాలా మంది అనుకుంటున్నారు.. అందుకే ఈ సినిమాలు చేస్తే మంచి హిట్ అవుతాయి. వాస్తవానికి ఈ కాంబినేషన్ ను వాస్తవరూపంలోకి తెచ్చే ప్రయత్నం గతంలో జరిగిందట. 

 

కాకుంటే.. ఇమేజ్  చట్రంలో నుంచి తమ అభిమాన నటుల్ని చూసే అలవాటున్న తెలుగు ప్రేక్షకులు ఈ కాంబినేషన్ వర్క్ వుట్ కాకుండా చేశారట. ఈ విషయాన్ని ఎవరో కాదు.. ప్రముఖ దర్శకుడు కొరటాల శివనే చెప్పుకొచ్చారు. బాలయ్య.. తారక్ కలిసి చేసే సినిమా అంటే.. అందులో రెండు పాత్రలకు ప్రాధాన్యత సమంగా ఉండటంతో పాటు.. మరికొన్ని లెక్కలు చప్పున వస్తాయి. ఇదే ఆలోచన.. ఈ ఆసక్తికరమైన కాంబినేషన్ ను తెరకెక్కుండా అడ్డుకుందట.

 

 

2016లొ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ చేసిన పాత్రను తొలుత బాలయ్యతో చేయాలనుకున్నారట. అయితే.. ఈ చిత్రంలో కథలో నటులు ఇమిడిపోవాల్సి ఉంటుంది. నటులకు ఉన్న ఇమేజ్ మిస్ కాకూడదన్న లక్ష్యంతో సినిమా తీస్తే కథను చాలానే మార్చాల్సి ఉంటుంది. అదే జరిగితే.. సినిమా మరోలా మారుతుంది. జనతాగ్యారేజీ చిత్రం కథలో నటులు ఇమిడిపోవాలే తప్పించి.. నటులకు తగ్గట్లు కథను మార్చలేని పరిస్థితి.... అందుకే ఆ పాత్రను మోహన్ లాల్ చేశాడు సినిమా కూడా హిట్ అయింది.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: