దళపతి  విజయ్, ఖైదీ డైరెక్టర్  లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం మాస్టర్.   ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అందులో భాగంగా చెన్నై లో  కీలక షెడ్యూల్ ను చిత్రీకరిస్తున్నారు.  ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం  యొక్క ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ రాగ  తాజాగా సంక్రాంతి కానుకగా ఈ సినిమా నుండి రెండవ పోస్టర్  ను  విడుదల చేశారు.   
 
 
ఈ సెకండ్ లుక్ లో విజయ్  చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. ఇంకా ఈ చిత్రం సగం కూడా షూటింగ్ పూర్తి చేసుకోక ముందే  ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ మరియు నాన్  థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అవ్వడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 250కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని  సమాచారం. తద్వారా  విజయ్ కెరీర్ లో హైయెస్ట్  ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రం గా మాస్టర్ రికార్డు సృష్టించింది. 
 
 
మాస్టర్ తెలుగు వెర్షన్  హక్కులను యువ నిర్మాత mahesh KONERU' target='_blank' title='మహేష్ ఎస్ కోనేరు -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మహేష్ ఎస్ కోనేరు 9కోట్లకు దక్కించుకున్నాడు. ఇంతకుముందు విజయ్ నటించిన బిగిల్ ను కూడా  తెలుగులో విజిల్ పేరుతో ఆయనే విడుదలచేశాడు.  యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న మాస్టర్ లో మక్కల్ సెల్వన్  విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండగా పేట ఫేమ్ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది.  వీరితో పాటు ఆండ్రియా  జెర్మియా ,శంతన్  భాగ్యరాజ్ ముఖ్య పాత్రల్లో  నటిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా  భారీ బడ్జెట్ తో ఎక్స్ బి ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక  గత  కొంత  కాలంగా  విజయ్ వరస  హిట్లు కొడుతుండడంతో ఏప్రిల్ 9న విడుదలకానున్న ఈ చిత్రం ఫై  తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: