సినిమా ఇండస్ట్రీలో ఎన్నెన్నో అనుకుంటాము అవన్నీ కూడా కేవలం మాటల వరకే ఉంటాయి.. సినిమా హిట్ అయితే కొంత మంది దర్శక నిర్మాతలు వారినే ఎక్కువగా చూసుకుంటారు.. మళ్లీ ఎన్ని సినిమాలు తీసిన కూడా వారినే హిరోయిన్ గా తీసుకొస్తారు.. లేదా వారితో సినిమాలో చిన్న పాత్రను అయినా చేయిస్తారు.. అలా చేస్తే సినిమా హిట్ అవుతుందని గట్టిగా నమ్ముతుంటారు.. 

 

వివరాల్లోకి వెళితే.. తాజాగా అల్లు అర్జున్, పూజ హెగ్డే నటించిన సినిమా అల వైకుంఠపురం లో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల అయిన సంగతి తెలిసిందే..అయితే,ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఈ చిత్ర హీరోయిన్ పూజ మీడియాతో మాట్లాడారు..ఆమె మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

 

ఈ సందర్భంగా ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చింది. అందులో ఒకటి.. అల్లు అర్జున్ తాను ఎవరైనా హీరోయిన్ తో ఒక సినిమా చేస్తే.. మళ్లీ అదే హీరోయిన్ తో సినిమా చేయటం కనిపించదు. దాన్ని బ్రేక్ చేసింది పూజా హెగ్డే ఒక్కరే. డీజేలో బన్నీతో చేసిన ఆమె.. అల.. చిత్రంలో చేసింది. ఎప్పుడూ హీరోయిన్స్ ను రిపీట్ చేయని బన్నీ తొలిసారి పూజా హెగ్డేతో మాత్రం రెండో సినిమా చేశారు.

 

ఈ అంశం మీద ఇప్పటికే చాలానే చర్చ నడుస్తోంది. అందరూ మాట్లాడే మాటల్నే.. సినిమా చేస్తున్న వేళ తాను బన్నీని అడిగినట్లుగా పూజాహేగ్డే చెప్పారు. నువ్వు ఎందుకు హీరోయిన్స్ ను రిపీట్ చేయవని తాను కూడా అల్లు అర్జున్ ను ఏడిపించినట్లు చెప్పిన పూజా.. దానికి బన్నీ ఎలా రియాక్ట్ అయ్యారో మాత్రం చెప్పలేదు. కాకుంటే.. డీజేలో తమ కెమిస్ట్రీకి మంచి స్పందన రావటంతో తనను తీసుకున్నారేమోనని చెప్పింది..మళ్లీ మరో సినిమాలో కూడా పూజ బన్నీ సరసన నటించాలని అనుకుంటుంది.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: