టీవీ షో ద్వారా యాక్టింగ్ కెరీర్ ప్రారంభించిన నిఖిలా విమల్, 2009లో మలయాళ సినిమా భాగ్యదేవతతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 2016లో వెట్రివల్ సినిమాతో... కోలీవుడ్‌లో అలరించిన ఈ కేరళ కుట్టీ... 2017లో వచ్చిన మేడ మీద అబ్బాయి సినిమాతో... తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు ఆ తర్వాత తెలుగులోనే గాయత్రి సినిమా చేసి... మళ్లీ శాండల్‌వుడ్, కోలీవుడ్ లోనే సినిమాలు చేస్తుంది.

 

 

ఇకపోతే భరతనాట్యం, కూచిపూడి, కేరళ నటనమ్ ఇవన్నీ నేర్చుకోవడం ఆమెకు ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ఈ కేరళ పిల్ల ఇప్పటివరకూ 12 సినిమాల్లో నటించగా, ప్రస్తుతం తమిళంలో మరో రెండు  సినిమాలతో బిజీగా ఉంది.

 

 

ఇకపోతే కార్తీకి జోడీగా ‘తంబి’ చిత్రంలో  నటించగా ఈ సినిమా దొంగ పేరుతో తెలుగులో  విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.. ఇప్పుడైతే బిజీగా ఉన్న నిఖిలా విమల్‌ కు ప్రస్తుతం తమిళంతో పాటు మలయాళంలోనూ అవకాశాలు వస్తున్నాయి.

 

 

ఇక కధల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్న ఈ బ్యూటీ గ్లామర్‌ పాత్రలకంటే నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లోనే నటించాలనుకుంటోందట.  ఒకవేళా అవకాశాలు లేకున్నా.. ఐటమ్‌ సాంగ్స్‌లో మాత్రం నటించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

 

 

ఇకపోతే దాదాపు సినిమారంగంలో ఉన్న ప్రతి హీరోయిన్ అవకాశాలు ఉన్నా, లేకున్నా ఐటమ్‌ సాంగ్స్‌ల్లో కనిపించడం మామూలే. ఇక మొదట్లో కొందరు హీరోయిన్స్ బెట్టు చేసిన తర్వాత ఇలాంటి సాంగ్స్ కు ఎలాగోలా ఒప్పుకున్న వారు ఉన్నారు.

 

 

ఇకపోతే కొందరు హీరోయిన్స్ చేతినిండా సినిమాలు ఉన్నప్పుడు వారి మాటలు గొప్పగానే ఉంటాయి. సినిమాలు లేనప్పుడు ఎలాగోలా దర్శకుల దృస్టిలో పడలాని ఫోటో షూట్స్,  ఐటెం సాంగ్స్ చేయడం పరిపాటే  మరి ఇంతగా ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్న నిఖిలా విమల్ ఎంతవరకు తన మాట మీద ఉంటుందో చూడాలని కొందరు అనుకుంటున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: