బాహుబ‌లి చిత్రం త‌ర్వాత జ‌క్క‌న ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్‌.  మ‌ల్టీ స్టార‌ర్‌తో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ చిత్రం మొద‌లైన ద‌గ్గ‌ర నుండి రోజుకొక కొత్త వార్త బ‌య‌ట‌కు రావ‌డం తెలిసిన విష‌య‌మే. ఇక ఈ  చిత్రం పై ప్రేక్ష‌కుల‌కు మొద‌టి నుంచే ప్ర‌త్యేక‌మైన ఆశ‌క్తిక‌రాన్ని తీసుకువ‌చ్చాడు రాజ‌మౌళి. ఆయ‌న మొద‌టి నుంచి కూడా ఏ చిత్రం చేసినా అంతే ఆయ‌న ప్ర‌మోష‌న్ స్టైలే చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది.

 

 ఇక ఈ చిత్రంలో  రెండు ముఖ్య ఘట్టాలైనా ఇంటర్వల్ మరియు క్లైమాక్స్ స‌న్నివేశాల‌లో... వచ్చే పోరాట సన్నివేశాలకు రాజమౌళి సగం బడ్జెట్ కేటాయిస్తున్నారట. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ సన్నివేశంలో ఎన్టీఆర్, చరణ్ లు కొమరం భీమ్.. అల్లూరి సీతారామ రాజులుగా బ్రిటిష్ సైన్యం పై యుద్ధం చేస్తారట. ఈ యుద్ధ సన్నివేశం విజువల్ వండర్ గా తీర్చిద్దిడానికి రాజమౌళి భారీ బడ్జెట్ కేటాయించారు. ఇక పతాక సన్నివేశాలలో వచ్చే పోరాట సన్నివేశాలపై కూడా జక్కన్న ప్రత్యేక శ్రద్ద పెట్టి అత్యున్నత విలువలతో తెరకెక్కించనున్న‌ట్లు స‌మాచారం. 

 


దీనితో ఆర్.ఆర్.ఆర్ మూవీ బడ్జెట్ లో దాదాపు సగం ఈ రెండు సన్నివేశాలకే జక్కన్న కేటాయించారు అని తెలుస్తుంది. v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య ఈ చిత్రాన్ని 300కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ జులై 30న విడుదల కానున్నట్లు గతంలో ప్రకటించారు. బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజెప్పిన దర్శకధీరుడు రాజమౌళి.. ఇద్దరు అగ్రహీరోలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తుండటంతో ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఏదైనా వైరల్ అవుతూనే ఉంది. అయితే టాలీవుడ్‌లో నంబర్ వన్ స్థానం కోసం పోటీ పడుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేసి ఓ నూతన ఒరవడికి నాంది పలికారు జక్కన్న.రాజమౌళి సినిమాల్లో హీరోలతో విలన్‌లకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇక రాజ‌మౌళి సినిమాల్లో విల‌నిజం పండించ‌డం అంటే ఆయ‌న గ‌త చిత్రాల‌ను ఒక‌సారి నెమ‌ర‌వేసుకుంటే స‌రిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: