సంక్రాంతి పండుగ సంతోషాలన్నీ ఇప్పుడు సినిమాల సందడితో ముడిపడిపోయినట్టు అయింది పరిస్థితి. కటుంబంలో సంతోషంతో పాటు పండుగకు వచ్చే సినిమాలు కూడా ఓ భాగమైపోయాయి. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు సందడి చేశాయి. వాటిలో ఒకటి తమిళ డబ్బింగ్ మూవీ కాగా మిగిలిన మూడు సినిమాలు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు. ప్రస్తుతం ఈ సినిమాలు ధియేటర్లలో సందడి చేస్తున్నాయి. వీటిలో బన్నీ అల.. వైకుంఠపురములో సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో నడుస్తూండగా కల్యాణ్ రామ్ ఎంత మంచివాడవురాకు మిక్సిడ్ టాక్ తో నడుస్తోంది.

 

 

సంక్రాంతి సినిమాల్లో మహేశ్ సరిలేరు.., బన్నీ అల.. రెండూ పోటీ పడ్డాయి. రిలీజ్ డేట్స్ తోనే వారిద్దరి క్లాష్ మొదలైపోయింది. మొత్తానికి ఓరోజు ముందుగానే వచ్చాడు మహేశ్. అబౌ యావరేజ్ టాక్ ఉంది అనేలోపు మరునాడు వచ్చిన బన్నీ అల..కు ఓపెనింగ్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ పడిపోయింది. దీంతో అల.. సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అల..తో పోలిస్తే సరిలేరు కలెక్షన్లు రెండో రోజు నుంచే డ్రాప్ కనిపించింది. అల.. ఇప్పటికీ 95 పర్సెంట్ ఆక్యూపెన్సీతో రన్ అవుతుంటే సరిలేరు.. 80 పర్సెంట్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. సరిలేరుకు దక్కినన్ని ధియేటర్లు అల.. కు దక్కలేదు.

 

 

కానీ పండుగకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇచ్చిన అవకాశాన్ని అల.. సద్వినియోగం చేసుకుంటోంది. ఎర్లీ మార్నింగ్ షోలతో కుమ్మేస్తోంది. సంక్రాంతికి ముందుగా వచ్చిన రజినీకాంత్ దర్బార్ అయితే ఈ రెండు సినిమాల పోటీలో పత్తా లేకుండా పోయింది. నామమాత్రపు ఆక్యుపెన్సీతో రన్ అవుతోంది. కల్యాణ్ రామ్ సినిమా కూడా మిక్సిడ్ టాక్ రావడంతో నాలుగు సినిమాల ఫలితం దాదాపు తేలిపోయింది. వచ్చే ఆదివారం వరకూ ఈ రెండు సినిమాల స్పీడ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: